Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వ్యవసాయ క్షేత్రాల పరిశీలనకు రానున్న నేపాల్ బృందం

వ్యవసాయ క్షేత్రాల పరిశీలనకు రానున్న నేపాల్ బృందం

వార్త 3 months ago

Nepal Delegation Visit AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతు సాధికార సంస్థ అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఎపిసిఎన్ఎఫ్) విధానాలను అధ్యయనం చేసేందుకు నేపాల్ దేశానికి చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ నెల 27 నుండి 29 వరకు మూడు రోజుల పాటు గుంటూరు, ఏలూరు జిల్లాల్లో పర్యటించనుంది.

మొదటి రోజు గుంటూరులోని రైతు సాధికార సంస్థ కార్యాలయంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ విజయ కుమార్తో నేపాల్ బృందం సమావేశమవుతుంది. ప్రకృతి వ్యవసాయంలో కమ్యూనిటైజేషన్, ట్రాన్స్ ఫర్మే షన్, మార్కెటింగ్, హెల్త్, న్యూట్రిషన్ వంటి అంశాలపై ఆయా విభాగాల నిపుణులు బృందానికి అవగాహన కల్పిస్తారు. మధ్యాహ్నం అత్తోట గ్రామంలో 9 సూత్రాల అమలు, కమ్యూనిటి రిసోర్స్ పర్సన్స్ సభ్యులతో భేటీ, రైతు బాపయ్య విత్తన ఉత్పత్తి క్షేత్రాన్ని ఈ బృందం సందర్శించనుంది.

 Nepal study on AP natural farming.

Nepal Delegation Visits AP: ఏలూరు జిల్లాల్లో మూడు రోజుల పాటు పర్యటన

రెండవ రోజు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని గుండుగొలనుగుంట గ్రామంలో బృందం పర్యటిస్తుంది. ఇక్కడ బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్ను సందర్శించి బీజామృతం, జామృతం, ద్రవ జీవామృతం, అగ్ని అస్త్రం వంటి కషాయాల తయారీని పరిశీలిస్తారు. అలాగే ఆయిల్ పామ్, కొబ్బరి తోటల్లో అంతర పంటలుగా మిశ్రమ వ్యవసాయం చేస్తున్న క్షేత్రాలను, ప్రసిద్ధి చెందిన ‘ఎటిఎం’ మోడల్ సాగును బృందం సందర్శిస్తుంది.

స్వయం సహాయక మహిళా సంఘాలు, రైతు శాస్త్రవేత్తలతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించనున్నారు. చివరి రోజు గుంటూరు జిల్లా ఎరుకలపూడిలో జొన్న పంట క్లస్టర్లను, రైతు సేవా కేంద్రాలను సందర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ నమూనాలను, క్షేత్రస్థాయిలో రైతుల జీవన ప్రమాణాల్లో వస్తున్న మార్పులను నేపాల్లో కూడా అమలు చేసే అవకాశాలను పరిశీలించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha