Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యాడికి కాలువకు మహర్దశ

యాడికి కాలువకు మహర్దశ

వార్త 3 weeks ago

JC Asmit Reddy: రాయలసీమకు సాగునీరు అందిస్తే.. ఈ ప్రాంత రైతాంగం బంగారు పంటలు పండించి ప్రభుత్వాలకే అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు' అని గత రెండు నెలల క్రితం యాడికిలో జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ సాక్షిగా చేసిన సంచలన ప్రకటనను తాడిపత్రి శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి (MLA JC Asmit Reddy) ఆచరణలో చూపిస్తున్నారు.

తాడిపత్రి నియోజకవర్గ రైతాంగం పక్షాన నిలబడి, వారి ఆశయాలకు అనుగుణంగా యాడికి కాలువ (Yadiki Canal) పునరుద్ధరణ పనులను ఆయన యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై, పూడికతో నిండిపోయిన ఈ కాలువను ఆధునీకరించడం ద్వారా నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు భూములకు కూడా కృష్ణా జలాలను చేర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక కాలువ మరమ్మతులు మరియు ఆధునీకరణ పనుల కోసం జేసీ అస్మిత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కూటమి ప్రభుత్వం నుండి రూ.40 లక్షల నిధులను తక్షణమే మంజూరు చేయించారు.

ప్రభుత్వ నిధులకు అదనంగా సొంత ఖర్చు - వేగంగా పూడికతీత పనులు

పెద్దవడుగూరు మండలంలో ప్రారంభమై తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో సుమారు 24 కిలోమీటర్ల మేర సాగే ఈ యాడికి కాలువ కింద పెద్దవడుగూరు మండలంలోని 6 గ్రామాలు, తాడిపత్రి మండలంలోని 3 గ్రామాలు, మరియు యాడికి మండలంలోని 13 గ్రామాలతో కూడిన మొత్తం 22 పైగా గ్రామాలకు సాగు, తాగునీరు అందేలా దీనిని గతంలో నిర్మించారు. అయితే, సరైన వర్షాలు లేకపోవడం, కాలువ అంతటా జంగిల్ క్లియరెన్స్, పూడిక పేరుకుపోవడంతో గతంలో పూర్తిస్థాయిలో నీరు ప్రవహించేది కాదు. దీనిని గమనించిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, ప్రభుత్వం నుండి మంజూరైన రూ.40 లక్షల నిధులకు తోడు, పనుల్లో నాణ్యత కోసం తన సొంత నిధులను కూడా సమకూర్చుకుని మొత్తం రూ.70 లక్షల భారీ వ్యయంతో గత నాలుగు రోజుల నుండి కాలువ పూడికతీత పనులను (Canal Desiltation Works) శరవేగంగా చేయిస్తున్నారు.

రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో రాయలసీమ వ్యాప్తంగా అత్యధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ (IMD Forecast) ముందస్తు సూచనల మేరకు, వర్షపు నీరు వృథా కాకుండా కాలువ ద్వారా ప్రవహించేలా భారీ పొక్లైన్లు, యంత్రాలను ఏర్పాటు చేసి అహోరాత్రులు పనులు నిర్వహిస్తున్నారు.

JC Asmit Reddy: చివరి ఆయకట్టుకు నీరు - పండ్ల తోటల సాగుకు రైతుల ఉత్సాహం

ఈ పూడికతీత కార్యక్రమం విజయవంతం కావడం వల్ల 24 గ్రామాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, కరవు మండలాల్లో భూగర్భ జలాల (Groundwater Level) పెంపకానికి ఇది ఎంతగానో దోహదపడనుంది. ముఖ్యంగా తాడిపత్రి మండలంలో ఈ యాడికి కాలువకు చివరి ఆయకట్టు గ్రామమైన వెంకటాంపల్లికి సాగునీరు తీసుకురావడం ద్వారా, ఆ మార్గంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉన్న పెద్ద చెరువును పూర్తిగా నింపేందుకు వీలు కలుగుతుంది.

సాగునీటి లభ్యత గనుక పుష్కలంగా ఉంటే, తాడిపత్రి నియోజకవర్గంలో వాణిజ్యపరమైన పండ్ల తోటలను (Fruit Orchards) అత్యధికంగా సాగు చేసేందుకు స్థానిక రైతులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ ప్రాంత నేలలు పండ్ల తోటలకు అనుకూలంగా ఉండటంతో.. జామ, సపోటా, దానిమ్మ, అల్లనేరేడు, అరటి, బొప్పాయి, మరియు రేగు వంటి పంటలను విస్తృతంగా సాగు చేసి మార్కెట్ ద్వారా దేశ విదేశాలకు ఎగుమతి చేసి అధిక లాభాలు గడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

రైతుల ఆశలకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆశయాలు తోడైతే, తాడిపత్రి ప్రాంతం ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అత్యంత సంపన్న నియోజకవర్గంగా మారేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. జేసీ కుటుంబం ఎల్లప్పుడూ రైతుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకునేలా అస్మిత్ రెడ్డి చేస్తున్న ఈ భగీరథ ప్రయత్నం పట్ల తాడిపత్రి, యాడికి, పెద్దవడుగూరు మండలాల ప్రజాప్రతినిధులు, ప్రజలు, మరియు కరవు ప్రాంత రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు భూమిపూజ చేసిన బాలకృష్ణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha