Telegram Ban: నీట్-యుజి (NEET-UG 2026) రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తమ యాప్‌పై విధించిన తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ రష్యన్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ (Telegram) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
జూన్ 21న జరగబోయే పునఃపరీక్ష కంటే ముందే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై అత్యవసర విచారణ జరపాలని టెలిగ్రామ్ కోర్టును కోరింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిఫార్సుల మేరకు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) యాక్ట్, 2000 లోని సెక్షన్ 69A కింద కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఈ ఆంక్షలు విధించింది.
Read Also:Telegram Ban: నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్‌లో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం
జూన్ 22 వరకు నిషేధం - జూన్ 30 వరకు ‘ఎడిట్’ ఫీచర్ బంద్
Telegram Banned in India Reason NTA
పరీక్షల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌కు రెండు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 21న జరిగే నీట్-యుజి రీ-టెస్ట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని జూన్ 22 వరకు భారతదేశంలో టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. కేవలం యాప్ బ్లాక్ చేయడమే కాకుండా, జూన్ 30 వరకు భారతదేశంలో టెలిగ్రామ్‌లోని ‘మెసేజ్ ఎడిటింగ్’ (Message-Editing) ఫీచర్‌ను డిసేబుల్ చేయాలని స్పష్టం చేసింది.
‘మెసేజ్ ఎడిటింగ్’ ఫీచర్‌ను ముఠాలు ఎలా వాడుకున్నాయి?
ఎన్టీఏ (NTA) నివేదిక ప్రకారం.. టెలిగ్రామ్‌లో ఉండే పాత పోస్టులను ఎడిట్ చేసే సదుపాయాన్ని చీటింగ్ నెట్‌వర్క్స్ దారుణంగా దుర్వినియోగం చేశాయి. పరీక్ష ముగిసిన తర్వాత, కేటుగాళ్లు తాము కొన్ని రోజుల క్రితం పెట్టిన పాత పోస్టులను ఎడిట్ చేసి, అందులో అసలైన క్వశ్చన్ పేపర్ ఫైళ్లను అటాచ్ చేస్తున్నారు. టెలిగ్రామ్ పాత టైమ్‌స్టాంప్‌ను (Original Timestamp) అలాగే ఉంచడం వల్ల.. పరీక్ష కంటే ముందే పేపర్ లీక్ అయిందనే భ్రమను కల్పించి విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఇందుకోసం “PAPER LEAKED NEET”, “Re-NEET 2026”, “Private Mafia” వంటి పేర్లతో గ్రూపులు పెట్టి రూ.వేల నుండి లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇలాంటి నకిలీ ఛానెళ్లను బ్లాక్ చేస్తున్నప్పటికీ, వారు వెంటనే ప్రత్యామ్నాయ గ్రూపులు, బాట్లను (Bots) క్రియేట్ చేస్తుండటంతో.. కేవలం ఛానెళ్లను తొలగించడం సరిపోదని భావించిన ప్రభుత్వం ఏకంగా ప్లాట్‌ఫామ్‌పైనే తాత్కాలిక నిషేధం విధించింది.
Telegram Ban: రంగంలోకి ఐ4సీ (I4C) - ₹1.5 కోట్ల స్కామ్ గుర్తింపు
ఈ వ్యవహారంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నేతృత్వంలో రాష్ట్ర పోలీసు విభాగాలు గట్టి నిఘా పెట్టాయి. అంతర్రాష్ట్ర పరీక్షల మోసగాల ముఠాను అరెస్ట్ చేసిన అహ్మదాబాద్ పోలీసులు.. నకిలీ బ్యాంక్ ఖాతాల ద్వారా వీరు దాదాపు ₹1.5 కోట్ల విలువైన లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. బీహార్ పోలీసులకు చెందిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఇప్పటికే విద్యార్థులకు ఇలాంటి పేపర్ లీక్ స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పబ్లిక్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఏ భద్రతా చర్యలకు మద్దతుగా నిలిచిన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలిపింది. కాగా, టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కారియా బెంచ్ విచారించనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
అడ్మిట్ కార్డ్స్ విడుదల చేసిన ఎన్‌టీఏ.. డౌన్‌లోడ్ లింక్ ఇదే!

