Apple iPhone 18 Pro: ప్రముఖ దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ (Apple) త్వరలోనే లాంచ్ చేయనున్న ఐఫోన్ 18 ప్రో సిరీస్‌పై (iPhone 18 Pro Series) టెక్ వర్గాల్లో ఆసక్తికరమైన లీక్స్ చక్కర్లు కొడుతున్నాయి.
సెప్టెంబరులో అధికారికంగా విడుదల కానున్న ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ డిజైన్, బరువు, మందం మరియు రంగులకు సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చి ఆపిల్ ప్రియుల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
Read Also:Vivo X300e: అదిరిపోయే కెమెరాతో Vivo X300e కొత్త ఫోన్!
పెరగనున్న మందం & పెద్ద కెమెరా బంప్

టిప్‌స్టర్లు మరియు టెక్ నివేదికల ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లు ఐఫోన్ 17 ప్రో కంటే కొంత ఎక్కువ మందంతో రానున్నాయి.
- కెమెరా బంప్ ప్రభావం: బ్యాక్ కెమెరా మాడ్యూల్ లేదా కెమెరా బంప్ సైజ్ పెరగడం వల్లే ఈ వ్యత్యాసం కనిపిస్తోంది.
- మందం కొలతలు: ఫోన్ ప్రధాన బాడీ మందం 8.75 మిమీగా ఉండగా, కెమెరా బంప్‌తో కలిపి ఇది దాదాపు 10.75 మిమీ వరకు ఉండే అవకాశం ఉంది.
పెరగనున్న బరువు
ఫోన్ల బరువు విషయంలో వినియోగదారుల నుంచి విమర్శలు ఉన్నప్పటికీ, కొత్త మోడళ్ల బరువు మరికొంత పెరిగేలా కనిపిస్తోంది.
- ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ బరువు: కొత్త ప్రో మ్యాక్స్ మోడల్ బరువు 240 గ్రాములకు చేరవచ్చని అంచనా.
- ఇది ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (233 గ్రాములు) కంటే ఏడు గ్రామాలు ఎక్కువ కావడం గమనార్హం.
Apple iPhone 18 Pro: 'బ్లాక్' కలర్‌కు స్వస్తి.. కొత్తగా డార్క్ చెర్రీ
డిజైన్‌తో పాటు రంగుల ఎంపికలోనూ యాపిల్ కీలక మార్పులు చేస్తోందని ప్రచారం జరుగుతోంది.
- బ్లాక్ కలర్ అవుట్: ప్రో సిరీస్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన 'బ్లాక్' (Black) వేరియంట్‌ను ఈసారి నిలిపివేస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
- కొత్త వేరియంట్లు: దీనికి బదులుగా డార్క్ చెర్రీ (Dark Cherry), లైట్ బ్లూ (Light Blue), మరియు సిల్వర్ (Silver) రంగుల్లో ఫోన్‌ను తీసుకురావడానికి యాపిల్ యోచిస్తోంది.
యాపిల్ సంస్థ అధికారికంగా లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించే వరకు వీటిని కేవలం ప్రాథమిక అంచనాలుగా మాత్రమే పరిగణించాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

