IPL 2026 Updates: ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా, కొందరు కీలక విదేశీ బౌలర్లు ఇంకా తమ జట్లతో కలవకపోవడం ఫ్రాంచైజీలను ఆందోళనకు గురిచేస్తోంది.
ముఖ్యంగా శ్రీలంకకు చెందిన యార్కర్ కింగ్ మథీశ పథిరన, మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగల రాకపై ఇంకా స్పష్టత రాలేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) కొత్తగా తీసుకొచ్చిన కఠినమైన ఫిట్‌నెస్ నిబంధనలే దీనికి ప్రధాన కారణం.
Read Also: KKR vs PBKS Match : ఇరు జట్లకు ఒక్కో పాయింట్
IPL 2026 Updates: ఫిట్‌నెస్ టెస్ట్ పాసైతేనే అనుమతి
శ్రీలంక బోర్డు నిబంధనల ప్రకారం, విదేశీ లీగ్‌లలో ఆడే ఆటగాళ్లు తప్పనిసరిగా ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కీలకమైన హసరంగ పరిస్థితి ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఆయన ఇంకా ఫిట్‌నెస్ పరీక్షకు హాజరు కాలేదు, అలాగే ఐపీఎల్ ఆడేందుకు కావాల్సిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) కోసం బోర్డుకు దరఖాస్తు కూడా చేయలేదు.ఇటీవలే ముగిసిన ప్రపంచకప్‌లో గాయపడిన పథిరన ప్రస్తుతం కోలుకుంటున్నాడు. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఈ పేసర్, ఏప్రిల్ మూడో వారంలో ఫిట్‌నెస్ టెస్ట్ పాసై భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. ప్రధాన పేసర్ల కొరతతో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ అతని కోసం వేచి చూస్తోంది.
IPL Sri Lankan players update
బోర్డు నిబంధనలపై ప్లేయర్ల అసంతృప్తి
శ్రీలంక బోర్డు విదేశీ లీగ్‌ల విషయంలో అనుసరిస్తున్న కఠిన వైఖరిపై ఆ దేశ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతివ్వాలని ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నువాన్ తుషార ఏకంగా కోర్టునే ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
హార్దిక్ పాండ్యా ఇంట్లో నటాషా.. విడాకుల తర్వాత మళ్ళీ కలిశారా? ఫోటోలు చూస్తే షాక్!

