Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యశ్ 'టాక్సిక్' చిత్రం నుంచి రెండో పాట 'మనసు ఆగదే' విడుదల!

యశ్ 'టాక్సిక్' చిత్రం నుంచి రెండో పాట 'మనసు ఆగదే' విడుదల!

వార్త 2 weeks ago

Yash Toxic Movie: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం స్పీడ్ పెంచింది.

తాజాగా ఈ మూవీ నుంచి రెండో పాట 'మనసు ఆగదే'ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన తొలి పాట 'తబాహి'తోనే సినిమాపై బోల్డ్ రొమాంటిక్ టోన్‌ను సెట్ చేసిన చిత్రబృందం, ఇప్పుడు ఈ రెండో పాటలో అంతకుమించిన కెమిస్ట్రీని ఆవిష్కరించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Read Also : Ram Charan RC17 Movie: రామ్ చరణ్ 'ఆర్‌సీ17'లో రష్మిక మందాన?

 Second song 'Manasu Aagade' from Yash's film 'Toxic' released!

Yash Toxic Movie: తారా సుతారియాతో రాకింగ్ స్టార్ రొమాన్స్

ఈ పాటలో యశ్, బాలీవుడ్ భామ తారా సుతారియా మధ్య పండిన కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాత్‌టబ్‌లో తారా సుతారియా గ్లామరస్ ఎంట్రీ ఇవ్వడం, ఆమెకు యశ్ గన్‌తో ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగే సరికొత్త సీన్, వర్షంలో సాగే వీరి రొమాంటిక్ మూమెంట్స్, కేఫ్‌లో ముద్దులతో కూడిన సన్నివేశాలు పాటకే ప్రత్యేక హైలైట్‌గా నిలిచాయి. దాంతో విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

తారల సమూహంతో గ్యాంగ్‌స్టర్ డ్రామా

లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సౌత్, నార్త్ కు చెందిన టాప్ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి వంటి నటీనటులు ఈ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ కథలో కనిపించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ మిశ్రా, కనిష్క్ బాగ్చీ స్వరాలు సమకూరుస్తున్నారు. 'మనసు ఆగదే' పాట విడుదలతో ఆగస్టు 26న రాబోతున్న 'టాక్సిక్' సినిమాపై అభిమానుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

కాకినాడ పోర్టు షూటింగ్‌లో బాలకృష్ణకు గాయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha