Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యశ్ 'టాక్సిక్'కు కోర్టు రక్షణ.. నెగెటివ్ ప్రచారానికి బ్రేక్

యశ్ 'టాక్సిక్'కు కోర్టు రక్షణ.. నెగెటివ్ ప్రచారానికి బ్రేక్

వార్త 2 weeks ago

Toxic Movie: పాన్ ఇండియా స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'టాక్సిక్' చుట్టూ గత కొంతకాలంగా కొన్ని పుకార్లు, దుష్ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ నేపథ్యంలో సినిమా చిత్రబృందం మరియు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇటువంటి తప్పుడు వార్తలకు చెక్ పెట్టేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, బెంగళూరు కోర్టు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు

నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన అడిషనల్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు, సినిమా ప్రతిష్ఠను కావాలనే దెబ్బతీసేలా లేదా తప్పుదారి పట్టించేలా ఎలాంటి కంటెంట్‌ను ప్రచురించకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) సహా ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ సినిమాకు వ్యతిరేకంగా పోస్టులు చేయడం, షేర్ చేయడం, లేదా స్ట్రీమింగ్ చేయడాన్ని నిషేధిస్తూ మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

Toxic Movie: సెప్టెంబర్ 28 వరకు ఆంక్షలు అమల్లోకి

ఈ మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ తేదీ అయిన సెప్టెంబర్ 28 వరకు పూర్తిగా అమల్లో ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇంజంక్షన్ ఉత్తర్వులు రద్దు చేయబడతాయని కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఉద్దేశపూర్వకంగా సినిమాపై తప్పుడు ప్రచారాలు సృష్టిస్తున్న వ్యక్తులు, పేజీలు మరియు సంస్థలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తేల్చిచెప్పింది.

కింగ్ నాగార్జున 100వ మూవీ..ఆగస్టు 29న టైటిల్ గ్లింప్స్ విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha