Tirupati News: ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించిన భజన బృందం..
ప్రతి శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ నిర్వహించే నగర సంకీర్తన కార్యక్రమం అనంతరం, నగర సంకీర్తన మండలి సభ్యులు యోగాసనాల ప్రదర్శనతో భక్తులను ఆకట్టుకున్నారు.
గోవిందరాజస్వామి ఆలయం ముందు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మికత, ఆరోగ్యం, క్రమశిక్షణల సమ్మేళనంగా నిలిచింది. యోగ గురువు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భజన మండలి సభ్యులు వివిధ యోగాసనాలను ప్రదర్శించి యోగ ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యోగ ప్రతి మనిషి జీవితంలో అంతర్భాగం కావాలని, యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా యోగ దినోత్సవ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో, యోగపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.(Tirupati News) భక్తి మార్గంలో నడుస్తూనే ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సందేశం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు వాసుదేవరెడ్డి, మునెప్పగారి మునినాథరెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి, రెడ్డిబాబు, నాగేశ్వరరెడ్డి, జైనేంద్ర, సిద్దవరం వెంకటాద్రి, కొండే జంగారెడ్డి, మురళి, మిట్టపల్లి బ్రహ్మానందం, కన్నప్పగారి కేశవులు, నాగరాజరెడ్డి, అరుణమ్మ, జయమ్మ, పద్మావతి, సుశీల, జ్యోతి, కళ్యాణి, సిద్ధమ్మ, ఉషశ్రీ, కల్పన తదితరులు పాల్గొన్నారు.

