Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యోగాసనాలు వేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్.. వృద్ధాప్య ఆరోగ్యంపై కీలక సందేశం!

యోగాసనాలు వేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్.. వృద్ధాప్య ఆరోగ్యంపై కీలక సందేశం!

వార్త 2 weeks ago

Medak Yoga Day: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలెక్టర్ ప్రతిమా సింగ్.ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం కోసం యోగ" అనే థీమ్‌.మా నవ శక్తులన్నింటినీ ఏకం చేసే ఏకాగ్రత సాధించడం యోగాకే సాధ్యం.భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద యోగ వయో, లింగ భేదం లేకుండా అందరూ యోగాను సాధన చేయాలి.

యోగా గురువు రవి అధికారులతో ఆసనాలు చేయించారు కలెక్టర్‌ ప్రతిమాసింగ్ యోగాసనాలు వేసి అందర్నీ ఉత్తేజపరిచారు.

Medak Yoga Day: ఆదివారం మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం ప్రాంగణంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం - 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, మెదక్ ఆర్డీవో రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భూక్య జ్ఞానేశ్వర్ , డిసిహెచ్ఎస్ డాక్టర్ శివదయాల్ , ఆయుష్ విభాగం మోహన్ రెడ్డి , జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్ ,విశిష్ట యోగ గురువు ఆకుల రవి తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముందుగా కలెక్టర్ ప్రతిమాసింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. "ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం కోసం యోగ" అనే థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో,జిల్లా కలెక్టర్ , ప్రతి మాసింగ్ ఇన్చార్జి.అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్ , మెదక్ ఆర్డీవో రమాదేవి లు స్వయంగా యోగా ఆసనాలు చేస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందనిఆరోగ్యవంతమైన వృద్ధాప్యం కోసం యోగ" అనే థీమ్‌ తో ముందుకు సాగాలన్నారు మా నవ శక్తులన్నింటినీ ఏకం చేసే ఏకాగ్రత సాధించడం యోగాకే సాధ్యం. అన్నారు
భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద యోగ అని పిలుపునిచ్చారు. "యోగ అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు… శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద యోగ" అని పేర్కొన్నారు. అనంతరం యోగాలో పాల్గొన్న ఆయుష్ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు , క్రీడాకారులు క్రీడాభిమానులతో కలెక్టర్ ఫోటో సెషన్ లో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, విశిష్ట యోగ ఇన్స్ట్రక్టర్ దేవేందర్ రెడ్డి , పిడి ఆనందం , నరసింహులు , కొండల్ రెడ్డి ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, మండల అధికారులు , వైద్య సిబ్బంది, విద్యార్థులు, యువత, మహిళాలు, స్వచ్ఛంద సంస్థలు, యోగా సాధకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha