Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యుద్ధ సమయంలో భారత్ మాకు అండగా నిలిచింది: ఇరాన్

యుద్ధ సమయంలో భారత్ మాకు అండగా నిలిచింది: ఇరాన్

వార్త 2 months ago

రాన్ పట్ల భారత్ చూపుతున్న ఈ సానుభూతి వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు భారత్‌కు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం. దీని ద్వారా ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియా దేశాలకు భారత్ చేరువ కాగలదు.

గతంలో భారత్ ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం ఆంక్షలు ఉన్నప్పటికీ, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇరాన్‌తో సత్సంబంధాలు అవసరం. పశ్చిమాసియాలో యుద్ధం జరిగితే అది ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ప్రభావం చూపుతుంది. అందుకే శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని భారత్ కోరుకుంటోంది. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ రేవులను దిగ్బంధిస్తున్న తరుణంలో, భారత్ ఇరాన్‌కు సానుభూతి తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు అమెరికాతో బలమైన రక్షణ సంబంధాలు కలిగి ఉంటూనే, మరోవైపు చారిత్రక మిత్రదేశమైన ఇరాన్‌తో సంబంధాలను తెంచుకోకుండా భారత్ ‘తటస్థ’ వైఖరిని ప్రదర్శిస్తోంది.

Read Also: US Iran peace talks : నెతన్యాహు ఫోన్ కాల్‌తో శాంతి చర్చలు భంగం

 Abdul Majid Hakim Elahi

Abdul Majid Hakim Elahi: జలసంధి ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు

“భారత్ మాకు మద్దతుగా నిలించింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయతుల్లా మరణానికి నేటితో 40 రోజులు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ సభలో ప్రభుత్వ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ మేము కృతజ్ఞులు” అని అబ్దుల్ మజిద్ హకీమ్ అన్నారు. హోర్ముజ్ జలసంధిపై కూడా అబ్దుల్ మజిద్ హకీమ్ ఇలాహి మాట్లాడారు. ఈ జలసంధి ఏ ఒక్క దేశానికో పరిమితం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇది ప్రపంచ దేశాలన్నింటికీ చెందుతుందన్నారు. అలాగే, హోర్ముజ్ జలసంధిని దగ్బంధించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఆయన తోసిపుచ్చారు. ఇరాన్‌కు టోల్ చెల్లించే ఓడలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కూడా ఇలాహి మాట్లాడారు. తాము ఈ జలసంధిని మూసివేయాలని అనుకోవడం లేదన్నారు. ఎవరికీ నష్టం కలిగించాలని తమకు లేదన్నారు. ఈ సమస్యలన్నింటికీ అమెరికానే కారణమని చెప్పారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమై, పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని చెప్పారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ట్రంప్ సంచలన ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha