న్యూఢిల్లీలో జరిగిన చారిత్రాత్మక భేటీలో భారత్, ఆస్ట్రియా దేశాలు అంతర్జాతీయ ఉద్రిక్తతలపై గట్టి గళాన్ని వినిపించాయి. ఉక్రెయిన్, పశ్చిమాసియా (Middle East) సంక్షోభాల నేపథ్యంలో సైనిక ఘర్షణల వల్ల ఎటువంటి శాశ్వత పరిష్కారం లభించదని ఇరు దేశాల నేతలు స్పష్టం చేశారు.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు అత్యంత సీరియస్‌గా ఉన్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వద్దు – దౌత్యమే ముద్దు: సైనిక దాడుల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం తప్ప సమస్యలు పరిష్కారం కావని, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని మోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా సహించకూడదని, దానిని కూకటివేళ్లతో పెకిలించాలనే విషయంలో భారత్, ఆస్ట్రియాలు ఒకే తాటిపై ఉన్నాయని ప్రకటించారు.
Read Also: PM Modi: రుగ్వేద శ్లోకంతో ప్రధాని మోదీ ట్వీట్.. నారీశక్తిపై ప్రశంసలు!
Middle East War
Middle East War: అంతర్జాతీయ సంస్థల్లో మార్పులు రావాలి
ప్రస్తుత ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు విఫలమవుతున్నాయని, వాటిలో తక్షణమే సంస్కరణలు జరగాలని మోదీ డిమాండ్ చేశారు. కాలం చెల్లిన నిబంధనలతో కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సంస్థలు రూపాంతరం చెందాలని ఆస్ట్రియా ఛాన్స్‌లర్ కూడా మద్దతు తెలిపారు. ఆస్ట్రియా ఛాన్స్‌లర్ పర్యటన కేవలం శాంతి చర్చలకే పరిమితం కాలేదు, ఆర్థిక బలోపేతానికి కూడా పునాది వేసింది. భారత్ మరియు యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. 2024లో మోదీ ఆస్ట్రియా పర్యటన తర్వాత, ఇప్పుడు ఆస్ట్రియా ఛాన్స్‌లర్ భారత్‌కు రావడం వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత మరియు విద్యుత్ రంగాల్లో సహకారం మరింత పెరుగుతుంది. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించి, సుస్థిరతను తీసుకురావడంలో భారత్ ఒక ‘విశ్వమిత్ర’గా వ్యవహరిస్తోందని ఈ భేటీ మరోసారి నిరూపించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

