Dailyhunt
యుద్ధం ఆపాలని ఐక్యరాజ్యసమితి పిలుపు

యుద్ధం ఆపాలని ఐక్యరాజ్యసమితి పిలుపు

వార్త 3 weeks ago

శ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ (Antonio Guterres) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

న్యూయార్క్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, పశ్చిమాసియా యుద్ధం మరణం- విధ్వంసం చక్రంలా మారుతోందని పేర్కొన్నారు. వెంటనే యుద్ధాన్ని నిలిపివేయాలని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణల కారణంగా మానవీయ నష్టం విపరీతంగా పెరుగుతోందని ఆంటోనియో గుటెరస్ చెప్పారు. రోజూ నిరపరాధ ప్రజలపై దాడులు పెరుగుతున్నాయని, పౌర మౌలిక వసతులు ధ్వంసమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Hormuz Strait: హర్ముజ్ జలసంధిలో నౌకలపై పన్నుల వాత.. సామాన్యుడికి తప్పని ఇంధన సెగ!

 West Asia Tensions

West Asia Tensions: కీలక సముద్ర మార్గం నిలిచిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ

ప్రపంచం ఒక పెద్ద యుద్ధ అంచున నిలిచిందని గుటెరస్ పేర్కొన్నారు. ఇప్పటికే ఆ ఘర్షణల ప్రభావం ప్రాంతీయ పరిమితులను దాటి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా సముద్ర మార్గాల అంతరాయం వల్ల అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతింటోందని తెలిపారు. ఆ తర్వాత హర్మూజ్ జలసంధి సమస్యపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ కీలక సముద్ర మార్గం నిలిచిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ తగులుతుందని అన్నారు. హర్మూజ్ జలసంధి మూసుకుపోతే పేద దేశాల ప్రజలు శ్వాస తీసుకోలేరని గుటెరస్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇంధన, ఆహార ధరలు పెరిగి ఫిలిప్పీన్స్ నుంచి శ్రీలంక, మొజాంబిక్ వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యుద్ధంలో పాల్గొంటున్న దేశాలకు గుటెరస్ స్పష్టమైన సందేశం ఇచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్ వెంటనే యుద్ధాన్ని ఆపాలని, ఇరాన్ తన పొరుగు దేశాలపై దాడులు నిలిపివేయాలని సూచించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఇరాన్ రాజకీయాల్లో సంచలనం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha