Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యుద్ధంపై ఇరాన్ ప్రకటనతో మళ్ళీ టెన్షన్

యుద్ధంపై ఇరాన్ ప్రకటనతో మళ్ళీ టెన్షన్

వార్త 2 days ago

Iran-America War: అమెరికాతో సాగుతున్న దౌత్య ప్రయత్నాలు ఒకవేళ విఫలమైతే తాము యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ మంగళవారం నాడు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

అయితే తమ ప్రాధాన్యత ఎప్పుడూ చర్చలకే ముందుగా ఉంటుందని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. వాషింగ్టన్ -టెహ్రాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) అమలును ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాల ప్రతినిధులు ఖతార్‌లో వేర్వేరుగా భేటీ కావడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్ నుండి ఈ కీలక ప్రకటన వెలువడింది. ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ఆ దేశ ప్రధాన సంధానకర్త అయిన మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ ఈ విషయాలను వెల్లడించారు. అమెరికాతో తాము చర్చలను కొనసాగిస్తామని స్పష్టం చేస్తూనే.. ఒకవేళ అవతలి పక్షం తమ కట్టుబాట్లను గౌరవించకపోతే సైనిక ఘర్షణకు వెనకాడబోమని ఆయన హెచ్చరించారు.

Read Also: US Removes Four Indian Companies: భారత్‌కు ఊరట: రష్యా ఆంక్షల జాబితా నుండి 4 భారతీయ కంపెనీలను తొలగించిన అమెరికా

 Iran-America War

Iran-America War: మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం

మేము చర్చలనే కోరుకుంటున్నాము, కానీ ఒకవేళ ఆ చర్చలు ఫలించకపోతే.. మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము. దానికి తగినట్లుగానే స్పందిస్తామని ఘాలిబాఫ్ నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా Iran అణు కార్యక్రమంపై దేశ వైఖరిని ఆయన స్పష్టం చేశారు. దేశ అణు హక్కులు, తాము గీసుకున్న రెడ్ లైన్స్ (లక్ష్మణ రేఖలు) విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇరాన్ అణు కార్యకలాపాలన్నీ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) పర్యవేక్షణలోనే.. అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) పరిధిలోనే జరుగుతున్నాయని వివరించారు. అణ్వస్త్ర సుసంపన్నతను ఇరాన్ తన హక్కుగా భావిస్తోందని, అమెరికా దురాగతాలకు వ్యతిరేకంగా, దేశ రక్షణకు ఇవి ఒక గ్యారెంటీ లాంటివని ఆయన అభివర్ణించారు.

read also:

చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరాన్ అధ్యక్షుడికి మోదీ సూచన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha