Nandu's World Reaction : నందు వరల్డ్… సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు. నంద కిశోర్, మధుమిత అనే జంట చేసే వీడియోలు నెట్టింట చాలా ఫేమస్.
రీసెంట్‌గా వీరిపై వీసా స్కామ్ ఆరోపణలు వచ్చాయి. నిరుద్యోగుల ఆశలను ఆసరా చేసుకుని కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలు రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంత జరిగినా వారు రియాక్ట్ కావడం లేదనే విమర్శలు వచ్చాయి. ఈ స్కామ్ ఆరోపణలపై నందు వరల్డ్ మధుమిత రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో కొందరు కావాలనే కుట్రతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు నంద కిశోర్ భార్య మధుమిత. ‘మాపై కొందరు కుట్రతో డబ్బులిచ్చి మరీ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అవన్నీ నమ్మొద్దు. ఈ విషయంపై యూకేలో ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడి నుంచి పారిపోయిన ముగ్గురు తెలుగు వాళ్లు ఇండియా వెళ్లి పనిగట్టుకుని డబ్బులు పెట్టి మరీ మాపై నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు.
Read Also: 2026-2030 Weather: రానున్న ఐదేళ్లలో భూమిపై భరించలేని వేడి: ఐరాస తీవ్ర హెచ్చరిక
Nandu’s World Reaction
మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు
నాకు, నా భర్తకు కానీ 21 ఏళ్లుగా ఇండియాలో ఎలాంటి కంపెనీలు మా పేర్లు మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇలాంటి వాటిని నమ్మకండి. మాకు ఏదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు గానీ, మా వర్క్ ప్లేసులు గానీ మిస్ యూజ్ చేసుకుని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వీటిని నమ్మకుండా ఇన్ఫార్మ్ చేయండి. మా గురించి ఏ విషయమైనా మేమే చెబుతాం.’ అని చెప్పారు. సోషల్ మీడియా సెలబ్రిటీలుగా ఫుల్ ఫేమస్ అయిన నందూస్ వరల్డ్ కపుల్… యూకే వెళ్లాలనే నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని భారీ మోసానికి తెర లేపినట్లు వీరిపై ఆరోపణలు వచ్చాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

