Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూపీఐ ఛార్జీలపై రాజకీయ సమరం: బీజేపీ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్!

యూపీఐ ఛార్జీలపై రాజకీయ సమరం: బీజేపీ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్!

వార్త 2 weeks ago

Congress Slams Govt UPI Charges : రూ.2,000లకు పైబడిన యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీల విధింపు వ్యవహారం కేంద్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య తీవ్ర రాజకీయాగ్నిని రగిల్చింది.

ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న తీవ్ర వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే మోదీ సర్కార్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

Modi 76th Birthday: మోదీ 76వ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా బీజేపీ సేవా కార్యక్రమాలు

 Congress Slams Govt UPI Charges

Congress Slams Govt UPI Charges : పార్లమెంటు స్థాయీ సంఘం ఆధారంగా బీజేపీ విమర్శలు

యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. దీనిపై బీజేపీ స్పందిస్తూ- ఆర్థిక వ్యవహారాల పార్లమెంటు స్థాయీ సంఘంలో సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలు పి. చిదంబరం, మనీశ్ తివారీ, గౌరవ్ గొగొయ్‌లు ఎండీఆర్ ఛార్జీల విధించే నిర్ణయాన్ని సమర్థించారని, బయటకు మాత్రం రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించింది. బీజేపీ వాదనలను కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగొయ్, మనీశ్ తివారీ ఖండించారు. స్థాయీ సంఘం సమావేశాల్లో MDR ఫీజులు, శ్లాబుల గురించి ఎటువంటి నిర్దిష్ట చర్చ జరగలేదని స్పష్టం చేశారు. సాధారణంగా రహస్యంగా ఉంచాల్సిన పార్లమెంటు కమిటీ సంభాషణలను, సమావేశ అంశాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం వాడుకోవడం సిగ్గుచేటని మనీశ్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేటి నుంచి దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha