Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూపీలో భారీ వర్షాలు ..17 మంది మృతి

యూపీలో భారీ వర్షాలు ..17 మంది మృతి

వార్త 3 weeks ago

Heavy Rains in UP : ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్రంగా ముంచెత్తుతున్నాయి. గడిచిన మూడు రోజుల వ్యవధిలోనే వర్షాలు మరియు వరద సంబంధిత ఘటనల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర అధికారులు వెల్లడించారు.

ముఖ్యంగా రాష్ట్రంలోని 8 జిల్లాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా మారి, తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి. జాతీయ రహదారులపైకి వరద నీరు భారీగా చేరుకోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయి వాహనదారులు, ప్రయాణికులు నడిరోడ్డుపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సహాయక చర్యల వేగవంతం: సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు

రాష్ట్రంలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించి, బాధితులకు తక్షణమే సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, సహాయ పునరావాస చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. బాధితులకు నిత్యావసర వస్తువులు, తాగునీరు, వైద్య సదుపాయాలు త్వరితగతిన అందేలా చూడాలని మరియు ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

పిఎఫ్లో కీలక మార్పు.. ఇక ఉద్యోగుల జీతం నుంచి ఎంత కట్ అవుతుందో తెలుసా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha