Uttar Pradesh Crime: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ (Sambhal) జిల్లాలో జరిగిన ఒక అత్యంత క్రూరమైన, సంచలనమైన యాసిడ్ దాడి కేసులో స్థానిక కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.
నిద్రపోతున్న భర్త ముఖంపై యాసిడ్ పోసి, అతడిని శాశ్వత అంధుడిని చేసిన 30 ఏళ్ల కహకషా (Kahkasha) అనే మహిళకు కోర్టు జీవిత ఖైదు (Life Imprisonment) విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘోరానికి పాల్పడినందుకు గాను ఆమెకు జైలు శిక్షతో పాటు రూ. 1.75 లక్షల జరిమానా కూడా విధించింది.
ప్రేమ వివాహం.. వివాహేతర సంబంధం
P Sambhal Acid Attack Verdict Kahkasha Life Imprisonment Husband Muzaffar Ali Blind Extra Marital Affair
ఈ ఘోర ఉదంతానికి సంబంధించిన మూలాలు 2019 నాటి ప్రేమ వివాహంతో ముడిపడి ఉన్నాయి. బిజ్నోర్ జిల్లా నజీనాకు చెందిన కహకషా, సంభాల్‌కు చెందిన ముజఫర్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఐదేళ్ల కుమార్తె, రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నారు. ముజఫర్ దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, కహకషా ఇంటిని చూసుకునేది. కాలక్రమేణా కహకషాకు పొరుగున ఉండే ఒక యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ముజఫర్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
Uttar Pradesh Crime:ఆ రాత్రి అసలేం జరిగింది..?
మార్చి 7, 2025 తెల్లవారుజామున కహకషా తన ప్రియుడితో కలిసి ఇంట్లో అభ్యంతరకర స్థితిలో ఉండగా ముజఫర్ చూశాడు. ఆయన గట్టిగా కేకలు వేయడంతో ప్రియుడు పరారయ్యాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరగ్గా.. స్థానికులు వచ్చి సర్దిచెప్పారు. అయితే, భర్తపై కక్ష పెంచుకున్న కహకషా.. అదే రోజు మార్కెట్‌కు వెళ్లి యాసిడ్ కొనుగోలు చేసింది. ఆ రాత్రి ముజఫర్ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఆయన ముఖం, కళ్లపై నేరుగా యాసిడ్ పోసింది.
వెంటాడి.. వేటాడి మరీ దాడి
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, మొదటిసారి యాసిడ్ పోయగానే ముజఫర్ ప్రాణ భయంతో అరుస్తూ బయటకు పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ, కహకషా అంతటితో వదలకుండా యాసిడ్ బకెట్ మరియు మగ్‌తో ఆయనను వెంటాడి మరీ భుజాలు, పొట్ట భాగాలపై రెండో విడత యాసిడ్‌ను గుమ్మరించింది. తీవ్ర గాయాలైన ముజఫర్‌ను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించగా.. ఆయన ఆరు నెలల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, యాసిడ్ తీవ్రతకు ఆయన రెండు కళ్ల చూపు పూర్తిగా పోయి శాశ్వత అంధుడిగా మారారు.
విషం ఇచ్చి చంపేందుకు కూడా కుట్ర
ఈ విచారణలో మరో నమ్మలేని నిజం కూడా వెలుగుచూసింది. యాసిడ్ దాడికి ఒకరోజు ముందు, అంటే మార్చి 6, 2025న కహకషా తన తల్లి, సోదరుడు మరికొందరి సహాయంతో ముజఫర్ తినే ఆహారంలో విషం కలిపి చంపేందుకు ప్రయత్నించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అయితే దీనిపై విడిగా ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు.
ఏడాది పాటు సాగిన కోర్టు విచారణ
అదనపు జిల్లా న్యాయమూర్తి గోపాల్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును ఏడాది పాటు సుదీర్ఘంగా విచారించింది. 10 విచారణల అనంతరం మే 27న కహకషాను దోషిగా నిర్ధారించిన కోర్టు, తాజాగా ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ శిక్ష ఖరారు చేసింది. తీర్పు విన్న అనంతరం కహకషా కోర్టు హాల్లోనే కన్నీరు పెట్టుకోగా, మహిళా కానిస్టేబుళ్లు ఆమెను జైలుకు తరలించారు. ఈ విచారణకు బాధితుడు ముజఫర్ కూడా హాజరయ్యారు. మరోవైపు, ఈ తీర్పును పైకోర్టులో సవాల్ చేస్తామని డిఫెన్స్ లాయర్ పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

