Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యురేనియం నిల్వలను తొలగిస్తే.. ఇరాన్ తో యుద్ధం ముగింపు

యురేనియం నిల్వలను తొలగిస్తే.. ఇరాన్ తో యుద్ధం ముగింపు

వార్త 2 weeks ago

Netanyahu Warning Iran: ఇరాన్, అమెరికా, ఇశ్రాయేల్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే హర్మోజ్ జలసంధిపై అమెరికా తన గుప్పిట్లో పెట్టుకోగా..ఇరాన్ లోని కీలకనాయకత్వం మృత్యువాత పడ్డారు.

ఒకవైపు ఇరాన్ కు కోలుకోలేని దెబ్బ తగిలినా ఏమాత్రం అధైర్యపడకుండా తన పట్టును వీడడం లేదు. హర్మోజ్ జలసంధి సీజ్ వల్ల ప్రపంచదేశాలు పెట్రోల్, డీజల్, ఎల్ పిజీ గ్యాస్ కోసం అల్లాడుతున్నాయి. వీటిధరలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రపంచదేశాలు తీవ్ర అసంతృప్తితో, ఆవేదనలో ఉన్నాయి.

Read Also:Donald Trump China Visit: మళ్లీ బీజింగ్‌కు ట్రంప్.. షీ జిన్‌పింగ్‌తో దోస్తీ ఫలిస్తుందా?

 Iran’s Uranium Stocks.

యుద్ధంలో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. అమెరికా, ఇరాన్ లమధ్య సీజ్ ఫైర్ ఒప్పందం అయితే అయ్యింది కానీ, పూర్తిగా శాంతి ఒప్పందం కుదరడం లేదు. దీంతో అమెరికా, ఇశ్రాయేలు ఎంత కఠిన హెచ్చరికలు చేస్తున్నా ఇరాన్ కూడా అదేస్థాయిలో స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తున్నది. ఈ కారణంతోనే అమెరికా, ఇశ్రాయేల్, ఇరాన్ మధ్య యుద్ధం సమసిపోవడం లేదు.

Netanyahu Warning Iran: ఇరాన్ పై నెతన్యాహు వార్నింగ్

తాజాగా ఇశ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ పై తీవ్రమైన హెచ్చరికల్ని చేశారు. ఇరాన్ పై ఆమెరికా-ఇశ్రాయేల్ యుద్ధం ముగిసిందని భావించాలంటే, ఇరాన్ వద్ద ఉన్న సుసంపన్నం చేసిన యురేనియం నిల్వలను తప్పరిసరిగా తొలగించాలి అని డిమాండ్ చేశారు. ఆదివారం సిబిఎస్ న్యూస్ ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడుతూ ‘ఇరాన్ యురేనియంను పూర్తిగా తొలగించాలని నెతన్యాహు డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారని చెప్పారు. పెంటగాన్ నుండి మిగిలి ఉన్న సైనిక మద్దతు నుండి మనం క్రమంగా బయటపడాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ భావిస్తున్నట్లు చెప్పారు.

పరిష్కారం కాని యురేనియం నిల్వల సమస్యతో పాటు, ఇంకా సాధించాల్సిన అనేక ఇతర యుద్ధలక్ష్యాలు ఉన్నాయని నెతన్యాహు చెప్పారు. ‘ఇరాన్ ఇప్పటికీ ప్రాక్సీలకు మద్దతు ఇస్తోంది, వారు బాలిస్టిక్ క్షిపణులను ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు, మేం వాటిలో చాలావరకు నిరుపయోగం చేశాం, కానీ అవన్నీ ఇంకా అక్కడా ఉన్నాయి, చేయవలసిన పని ఉంది. బీజింగ్ ఇరాన్ కు సహాయంచేస్తోందని తనకు తెలుసని’ కూడా నెతన్యాహు పేర్కొన్నారు. ఇరాన్ తన యురేనియం నిల్వలను తొలగించనంతవరకు మేం వారితో యుద్ధం చేస్తూనే ఉంటామని నెతన్యాహు మరోసారి ఇరాన్ ను హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

జైలు నుండి విడుదలైన మాజీ ప్రధాని!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha