Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు..

యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు..

వార్త 2 weeks ago

Urea Shortage Medak: రామాయంపేట మండల కేంద్రంలోని పిఎసిఎస్ వద్ద మంగళవారం నాడు యూరియా లభించక రైతులు తీవ్ర ఆవేదన చెందారు. నిమిషాల్లో 2000 బస్తాల యూరియా క్లోజ్ కావడం పై ఆవేశం తో రామాయంపేట - మెదక్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.

పంటలకు ఎరువులు అందక దిక్కుతోచని స్థితిలో కన్నీటిపర్యంతమయ్యారు. అధికారులు సమాచారం ఇచ్చేలోపే ఆన్‌లైన్ బుకింగ్ పూర్తవుతోందని మండిపడ్డారు. యూరియా నిల్వలు తమకు దక్కకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also :Tadkal hospital: వైద్యం వికటించి పసికందు మృతి

Urea Shortage Medak: మండలంలోని ఇతర గ్రామాలతో పోలిస్తే తమపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని ఆగ్రహించారు. అధికారుల తీరు వల్ల వ్యవసాయం చేయడం భారంగా మారిందని వాపోయారు. ఎంతోకాలంగా నిరీక్షిస్తున్నా తమకు ఒక్క బస్తా కూడా అందడం లేదని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం ఇలాగే ఉంటే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన చెందారు. వెంటనే అధికారులు స్పందించి యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వ్యవసాయం వదులుకుని పురుగుల మందు తాగడానికైనా సిద్ధమని హెచ్చరించారు. గంటపాటు రాస్తారోకో చేయడంతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచి, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, రైతులకు సముదాయించడం తో ఆందోళన విరమించారు

వేతన కోతపై మెదక్ మున్సిపల్ కార్మికుల మహాధర్నా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha