Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యువకుడి ప్రాణం తీసిన ఇన్‌స్టా ప్రేమ

యువకుడి ప్రాణం తీసిన ఇన్‌స్టా ప్రేమ

వార్త 2 weeks ago

Bengaluru Crime: సోషల్ మీడియా పరిచయాలు, అక్రమ సంబంధాలు ప్రాణాల మీదకు తెస్తాయనే దానికి బెంగళూరులో జరిగిన ఈ ఘటన మరో నిదర్శనంగా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ వివాహితతో సహజీవనం చేస్తున్న యువకుడు, ఆమె వేధింపులు భరించలేక తన జీవితాన్ని ముగించుకున్నాడు.

Read Also:Srilanka Buddhist Monk: ఆధ్యాత్మిక ముసుగులో అరాచకం..15 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు

ఘటన వివరాలు:

  • మృతుడు: చిత్రదుర్గకు చెందిన తిప్పేస్వామి (28).
  • నిందితురాలు: ప్రియాంక (వివాహిత).
  • నేపథ్యం: ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన వీరిద్దరూ, గత రెండు నెలలుగా బెంగళూరులోని రాజగోపాల్‌నగర్‌లో ఓ అద్దె ఇంట్లో సహజీవనం చేస్తున్నారు.

Bengaluru Crime: ఏం జరిగింది?

సహజీవనం ప్రారంభించిన కొద్దిరోజులకే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రియాంక తన విలాసాలకు అయ్యే ఖర్చులు భరించాలని తిప్పేస్వామిని ఒత్తిడి చేసేది. అతను భరించలేనని చెప్పడంతో, “నా ఖర్చులు భరించలేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో” అంటూ మానసికంగా వేధించడం ప్రారంభించింది. ఆమె పెడుతున్న టార్చర్ తట్టుకోలేక తిప్పేస్వామి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజగోపాల్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని మహిళల నిరసన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha