Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన డెలివరీ బాయ్ అరెస్ట్

యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన డెలివరీ బాయ్ అరెస్ట్

వార్త 3 weeks ago

Bengaluru : కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ యువతి పట్ల అత్యంత అసభ్యకరంగా, వికృతంగా ప్రవర్తించిన ఆన్‌లైన్ ఈ-కామర్స్ డెలివరీ బాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడిని కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన 22 ఏళ్ల విజయ్ మల్లికార్జున్ కామత్‌గా పోలీసులు గుర్తించారు. ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చిన సమయంలో నిందితుడు తన ప్రైవేట్ భాగాలను చూపిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడని బాధిత యువతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అనాగరిక చర్యపై తక్షణమే స్పందించిన పోలీసులు నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని మహిళల గౌరవానికి భంగం కలిగించడం, వేధింపులకు సంబంధించిన అత్యంత కఠినమైన 75, 79 మరియు 329(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

పార్ట్‌నర్‌షిప్ రద్దు చేసిన ఫ్లిప్‌కార్ట్.. భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు

ఈ ఘోరమైన ఘటన సోషల్ మీడియా మరియు మీడియాలో వైరల్‌గా మారడంతో సదరు ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) దీనిపై అధికారికంగా స్పందించింది. తమ సంస్థలో ఇలాంటి ప్రవర్తనను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేస్తూ, విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే నిందితుడు విజయ్ మల్లికార్జున్‌తో ఉన్న డెలివరీ పార్ట్‌నర్‌షిప్‌ను తక్షణమే శాశ్వతంగా రద్దు చేసినట్లు ప్రకటించింది. పోలీసులు దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని సంస్థ పేర్కొంది. అయితే, నిత్యం లక్షలాది మంది మహిళలు ఆన్‌లైన్ షాపింగ్‌పై ఆధారపడుతున్న తరుణంలో, ఇలాంటి డెలివరీ ఏజెంట్ల నియమకంలో కంపెనీలు కనీస బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (నేర చరిత్ర పరిశీలన) మరియు కఠినమైన నిబంధనలు పాటించకపోవడం వల్లే మహిళల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ.. కేంద్రం సంచలన నిర్ణయం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha