Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
10రాష్ట్రాలు.24రాజ్యసభ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

10రాష్ట్రాలు.24రాజ్యసభ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

VIDHATHA 2 days ago

దేశంలోని 10రాష్ట్రాల పరిధిలో ఖాళీ అవుతున్న 24రాజ్యసభ స్థానాల భర్తీ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

జూన్‌ 18న ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు.

దేశంలోని 10రాష్ట్రాల పరిధిలో ఖాళీ అవుతున్న 24రాజ్యసభ స్థానాల భర్తీ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. 8వ తేదీ వరకు నామినేషన్‌ దాఖలుకు సమయం ఇచ్చింది. 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 11వ తేదీ వరకు అవకాశం కల్పించింది. జూన్‌ 18న ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు.

ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలలో రాష్ట్రాలలో నాలుగు స్థానాల చొప్పున, మధ్యప్రదేశ్ , రాజస్థాన్‌లలో మూడు స్థానాల చొప్పున, జార్ఖండ్‌లో రెండు స్థానాలకు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో ఒక్కో స్థానానికి రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలోని ఖాళీ కాబోతున్న 4 రాజ్యసభ స్థానాలలో వైసీపీకి చెందిన ఎంపీలు పిల్లి సుభాష్, పరిమళ నత్వాని, అయోధ్య రామిరెడ్డిలు, టీడీపీకి చెందిన సానా సతీష్ లు ఉన్నారు. అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల మేరకు టీడీపీ కూటమికే 4స్థానాలు దక్కనున్నాయి.

రాజ్యసభ ఎన్నికలు ముగిశాక కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని, అందులో ఏపీ ఎంపీలకు చాన్స్ దక్కనుందని సమాాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA