Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Accreditation Cards | అక్రిడిటేషన్ కార్డుల జాప్యంపై తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

Accreditation Cards | అక్రిడిటేషన్ కార్డుల జాప్యంపై తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

VIDHATHA 3 days ago

Accreditation Cards | రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల పునరుద్ధరణ, గడువు పొడిగింపులో జాప్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

జూన్ 16 వరకు మీడియా అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు
సాయంత్రంలోగా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వ హామీ

Accreditation Cards | రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల పునరుద్ధరణ, గడువు పొడిగింపులో జాప్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన వెకేషన్ బెంచ్, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై ప్రశ్నలు సంధించింది.

అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు హాజరై మీడియా అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 జూన్ 16 వరకు పొడిగిస్తామని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సాయంత్రంలోగా జారీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు, అక్రిడిటేషన్ సమస్య కేవలం పిటిషనర్లకే పరిమితం కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ సంబంధించిన అంశమని వ్యాఖ్యానించింది. ఇప్పటికే మే 31లోపు ప్రక్రియ పూర్తి చేస్తామని డివిజన్ బెంచ్ ముందు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అనంతరం కోర్టు ఆదేశాలతో జూన్ 16 వరకు గడువు పొడిగించబడిందని గుర్తు చేసింది.

అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపులో జాప్యం కారణంగా జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది బర్కత్ అలీ ఖాన్ కోర్టుకు వివరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయం, అధికారిక సమావేశాలు, ప్రెస్ బ్రీఫింగ్‌లకు హాజరుకావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇది పాత్రికేయుల వృత్తి స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ హక్కులపై ప్రభావం చూపుతోందని వాదించారు.

జీవో 252 మరియు దాని సవరణలను సవాల్ చేస్తూ తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సహా పలువురు హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణను హైకోర్టు జూన్ 16, 2026కు వాయిదా వేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA