Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అగ్రిగోల్డ్‌ బాధితులకు 6 నెలల్లో న్యాయం: సీఎం చంద్రబాబు

అగ్రిగోల్డ్‌ బాధితులకు 6 నెలల్లో న్యాయం: సీఎం చంద్రబాబు

VIDHATHA 1 week ago

గ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సమస్య పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అగ్రిగోల్డ్‌ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు న్యాయం చేసేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏపీలోనే 11.5 లక్షలకు పైగా ఆగ్రీ గోల్డ్ బాధితులు ఉన్నారని పేర్కొన్నారు.

మరో 8 రాష్ట్రాల్లో సుమారు 20 లక్షల మంది బాధితులు ఉన్నారని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వంలో సీఐడీ అధికారులు కూడా అగ్రిగోల్డ్‌ సొమ్ము తిన్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అగ్రీగోల్డ్ సంస్థ 8 రాష్ట్రాల బాధితుల నుంచి రూ.7,386 కోట్లను అగ్రిగోల్డ్‌ సంస్థ కొల్లగొట్టిందన్న అభియోగాలతో కేసులు కొనసాగుతున్నాయి. బాధితులకు న్యాయం చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని, కేసును నీరుగార్చేలా సీఐడీ చీఫ్‌ వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ సాయం అందక ఏపీలో 600 మంది బాధితులు, 500 మంది ఏజెంట్లు ప్రాణాలు తీసుకున్నారంటూ ప్రజాసంఘాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో 9.50 లక్షల మందికి రూ.3,080 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఆస్తులు అటాచ్‌ చేసి బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్ వినిపించాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఆగ్రీగోల్డ్ బాధితులకు 6నెలల్లో న్యాయం చేస్తామని, త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు నిర్ణయించడం బాధితులకు ఊరటనిస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA