Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్..మూడు సరికొత్త 'భారత్ గౌరవ్' ప్యాకేజీలు!

ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్..మూడు సరికొత్త 'భారత్ గౌరవ్' ప్యాకేజీలు!

VIDHATHA 3 days ago

క్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్. దివ్య దక్షిణ్ యాత్ర, సప్త జ్యోతిర్లింగ దర్శన్, అయోధ్య-కాశీ టూర్లతో మూడు కొత్త భారత్ గౌరవ్ ప్యాకేజీలు ప్రారంభం కానున్నాయి.

ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం ఐఆర్సీటీసీ మూడు ప్రత్యేక భారత్ గౌరవ్ రైళ్లను ప్రారంభించనున్నట్లు మేనేజర్ పి.వీ. వెంకటేష్ తెలిపారు. దివ్య దక్షణ్ యాత్ర మే 24న అరుణాచలం-రామేశ్వరం మధ్య కొనసాగుతుంది. జూన్ 16న సప్త జ్యోతిర్లింగాలు, జూలై 4న అయోధ్య-కాశీ పుణ్యక్షేత్రాల యాత్రలు ప్రారంభమవుతాయి అని తెలిపారు. ఈ ప్యాకేజీలలో భక్తులకు హోటల్ బస, శాకాహార భోజనం, రవాణా, ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పిస్తారని వివరించారు.

దివ్య దక్షణ్ యాత్రలో తిరుమన్నామలై అరుణాచలం, మధురై రామేశ్వరం రంగనాధస్వామి, మీనాక్షి ఆలయం, కన్యాకుమారి, తిరుచీ అమ్మావారు, తంజావూర్ బృహదీశ్వరం, చిదంబరంలోని నటరాజ స్వామని దర్శించుకునేలా కొనసాగనుంది.

ఒకే ప్రయాణంలో ఏడు జ్యోతిర్లింగాలను దర్శించే అవకాశం 'భారత్ గౌరవ్' ప్యాకేజీలో ఉండటం విశేషం. "సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర" పేరుతో కొనసాగే ఈ ఆధ్యాత్మిక యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది.ఈ యాత్ర సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. మార్గంలో కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, హజూర్ సాహిబ్ నాందేడ్, పూర్ణ జంక్షన్ వంటి బోర్డింగ్ పాయింట్లు ఉంటాయి. అక్కడి నుంచి రైలు మధ్య భారతదేశం, పశ్చిమ భారతదేశం వైపు ప్రయాణిస్తుంది. మొదటగా యాత్ర ఉజ్జయినీకి చేరుకుంటుంది. అక్కడ భక్తులు మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తారు. ఇది 12 జ్యోతిర్లింగాల్లో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడ జరిగే భస్మ హారతి చాలా ప్రసిద్ధి పొందింది. తరువాత యాత్ర ఓంకారేశ్వర్‌కు వెళ్తుంది. నర్మదా నదిలో ఓం ఆకారంలో ఉన్న దీవిపై ఉన్న ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాన్ని భక్తులు దర్శిస్తారు.

తర్వాత యాత్ర గుజరాత్ వైపు కొనసాగుతుంది. ద్వారకలో భక్తులు ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ వైష్ణవ, శైవ సంప్రదాయాల కలయికను అనుభవిస్తారు. ఆ తరువాత నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది. ఇది నెగటివ్ శక్తుల నుంచి రక్షణ ఇస్తుందని నమ్మకం. తరువాత సోమనాథ్ చేరుకుంటారు. అక్కడ సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం జరుగుతుంది.జ్యోతిర్లింగాల్లో మొదటిది ఇదే అని కూడా చెబుతారు.

సోమనాథ్ తర్వాత రైలు మహారాష్ట్ర వైపు వెళ్తుంది. పుణేలో భీమశంకర్ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది. సహ్యాద్రి కొండల్లో ఉన్న ఈ ఆలయం ఎంతో పవిత్రమైనది. ఒకవేళ ఆలయం మరమ్మతులో ఉంటే, పుణేలోని షనివార్ వాడా, దగదుషేత్ హల్వాయి గణపతి దేవాలయం, కస్బా గణపతి ఆలయం, లాల్ మహల్, పాతాళేశ్వర్ గుహ ఆలయం వంటి ప్రదేశాలు సందర్శిస్తారు. తరువాత నాశిక్ చేరుకుని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తారు. ఇది త్రిమూర్తుల ప్రతీకగా ప్రత్యేకత కలిగి ఉంటుంది. చివరగా ఛత్రపతి సంభాజీ నగర్ సమీపంలోని ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం జరుగుతుంది. దీంతో ఏడు జ్యోతిర్లింగాల యాత్ర పూర్తవుతుంది.

ఆ తరువాత తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. నాందేడ్, నిజామాబాద్, కామారెడ్డి మీదుగా తిరిగి సికింద్రాబాద్ చేరుకుని యాత్ర ముగుస్తుంది. ఈ టూర్ స్లీపర్, 3ఏసీ, 2ఏసీ తరగతుల్లో అందుబాటులో ఉంటుంది. ఒక వ్యక్తికి ధర సుమారు 17,600 రూపాయల నుంచి 34,600 రూపాయల వరకు ఉంటుంది. ఈ ధరలో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది.

షాకింగ్…'కాక్రోచ్‌ జనతాపార్టీ' ఎక్స్‌ ఖాతా నిలిపివేత
Mini Cooper S JCW GP | మినీ కూపర్ స్పెషల్ ఇన్‌స్పైర్డ్ ఎడిషన్.. కేవలం 30 కార్లు మాత్రమే.. ధర ఎంతంటే..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA