Dailyhunt
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు .తెలంగాణలో సెలవు దినాలు!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు .తెలంగాణలో సెలవు దినాలు!

VIDHATHA 3 weeks ago

దు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణలో ప్రత్యేక సెలవులు ప్రకటించింది. ఓటు హక్కు వినియోగించుకునే వారికి జీతంతో సెలవు కల్పించింది.

విధాత, హైదరాబాద్ : ఈ నెలలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాల ఓటర్లు తమ రాష్ట్రాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడ ప్రత్యేక సెలవులు ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో ఓటు వేయడానికి వెళ్లే ఓటర్లకు సెలవులు వర్తించనున్నాయి.

ఫ్యాక్టరీలు, షాపులు, సంస్థల ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవు దినంగా ప్రకటించింది. ఏప్రిల్ 9న జరిగే అస్సాం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తో పాటు ఏప్రిల్ 23న జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు కూడా ప్రత్యేక సెలవు దినాలుగా ప్రకటించింది. అలాగే ఏప్రిల్ 23, 29వ తేదీల్లో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా కూడా తెలంగాణలోని ఆ రాష్ట్ర ఓటర్లకు ప్రత్యేక సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

చక్కటి కలలతో సుఖవంతమైన నిద్ర.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
కేసీఆర్ గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై దాడి..భగ్గుమన్న బీఆర్ఎస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA