Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అక్కడ అంత్యక్రియల నిర్వహణ నరకమే!

అక్కడ అంత్యక్రియల నిర్వహణ నరకమే!

VIDHATHA 5 days ago

పీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా భైరవపాలెం తీర్థాల మొండి గ్రామం స్మశాన వాటికకు వెళ్లేందుకు దారి లేక గ్రామస్థులు చనిపోయిన వారి అంత్యక్రియల నిర్వహణలో నరకం చూస్తున్నారు.

6 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే సముద్రపు పాయ దాటి స్మశానానికి వెళ్లాల్సిందేనని గ్రామస్థులు ఓ వీడియోను షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మనిషి మరణించాక నిర్వహించే అంత్యక్రియల తంతు పలు గ్రామాలు, పట్టణాల్లో సరైన శ్మశాన వాటికలు లేక, ఉన్నా..అక్కడికి చేరుకునేందుకు సరైన దారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు ఆధునిక సమాజంలోనూ వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వాలు శ్మశాన వాటికల ఏర్పాటుకు చర్యలు చేపట్టినప్పటికి ఇంకా అనేకచోట్ల అంత్యక్రియల నిర్వహణలో జనానికి సమస్యలు ఎదురవుతునే ఉన్నాయి.

ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా భైరవపాలెం తీర్థాల మొండి గ్రామం స్మశాన వాటికకు వెళ్లేందుకు దారి లేక గ్రామస్థులు చనిపోయిన వారి అంత్యక్రియల నిర్వహణలో నరకం చూస్తున్నారు. 6 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే సముద్రపు పాయ దాటి స్మశానానికి వెళ్లాల్సిందేనని గ్రామస్థులు ఓ వీడియోను షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్మశాన వాటిక వద్దకు చేరుకునేందుకు సముద్రపు పాయ మార్గంలో వంతెన నిర్మించాలని అధికారులకు, రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కరకట్ట వంటి నిర్మాణం చేసుకున్న సముద్రపు పాయ నీళ్ల ధాటికి అది తరచూ కొట్టుకపోతుండటంతో మళ్లీ శ్మశాన వాటిక దారి సమస్య పునరావృతమవుతునే ఉందని వాపోతున్నారు.

ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి స్మశాన వాటికకు వెళ్లేందుకు తాత్కాలికంగానైనా దారి ఏర్పాటు చేయాలని ..శాశ్వత ప్రాతిపదికన వంతెన నిర్మించాలని వేడుకుంటున్నారు.

National Highways | అమ్మకానికి 28 హైవేలు.. రూ.35 వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా కేంద్రం భారీ స్కెచ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA