Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Amba's Revenge : తెలుగులో తొలి ఏఐ సినిమా "అంబ's రివెంజ్"

Amba's Revenge : తెలుగులో తొలి ఏఐ సినిమా "అంబ's రివెంజ్"

VIDHATHA 7 months ago

తెలుగులో తొలి ఏఐ చిత్రం "అంబ's రివెంజ్" టైటిల్ పోస్టర్ విడుదల. మహాభారతం అంబ కథతో ఆధునిక టెక్నాలజీ కలయికగా ఆసక్తి రేపుతోంది.

హైదరాబాద్: చలనచిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టిస్తూ, సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్‌ ఫిల్మ్‌గా "అంబ's రివెంజ్" ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మాతగా, రాణి మాడిసన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్‌ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని ఈ పౌరాణిక చిత్రాన్ని వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ రెడ్డి కుందూరు, క్రియేటివ్ డైరెక్టర్ జయవర్ధన్ మాడి మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాము. "అంబ's రివెంజ్" ప్రాజెక్టు కోసం అత్యాధునిక ఏఐ టూల్స్‌ను వినియోగిస్తూ విజువల్స్‌, పాత్రల రూపకల్పన, కథన నిర్మాణం వంటి అంశాలను కొత్త శైలిలో ఆవిష్కరిస్తున్నాం. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంభందించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం " అని తెలిపారు.

తెలుగు సినీ పరిశ్రమలో ఏఐ ఆధారిత కథాచిత్రాల దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. పౌరాణిక కథను ఆధునిక సాంకేతికతతో మిళితం చేస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్రొడ్యూసర్ : శ్రీకాంత్ రెడ్డి కుందూరు
కో-ప్రొడ్యూసర్ : రాణి మాడిసన్
క్రియేటివ్ డైరెక్టర్ : జయవర్ధన్ మాడి
పీఆర్ఓ: అశోక్ దయ్యాల

Ravi Varma's Yashoda and Krishna Art : రాజా రవివర్మ చిత్రానికి రూ. 167.2కోట్లు !
Bakka Judson : రేవంత్ అప్పులపై రిజర్వ్ బ్యాంకులో పిటిషన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA