Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి నిజమేనా? సోషల్​ మీడియాలో ఊపందుకున్న ప్రచారం

అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి నిజమేనా? సోషల్​ మీడియాలో ఊపందుకున్న ప్రచారం

VIDHATHA 2 days ago

నిరుధ్‌ రవిచందర్‌, కావ్య మారన్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఇద్దరి వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

Are Anirudh Ravichander And Kavya Maran Getting Married? Truth Behind Viral Wedding Rumours

విధాతవినోదండెస్క్| మే 22, 2026:
చెన్నై: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని కావ్య మారన్‌, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ పేర్లు మరోసారి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని ఫ్యాన్‌ పేజీలు, సోషల్‌ మీడియా పోస్టులు, గాసిప్‌ వర్గాల్లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి ఈ ఏడాది చివర్లో విదేశాల్లో జరగవచ్చని, ఆ తర్వాత చెన్నైలో రిసెప్షన్‌ ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు అనిరుధ్‌ గానీ, కావ్య మారన్‌ గానీ, ఇరువురి కుటుంబ సభ్యులు గానీ ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజా వార్తలన్నీ ప్రస్తుతానికి ధృవీకరించని పుకార్లుగానే ఉన్నాయి.

అనిరుధ్‌ రవిచందర్‌, కావ్య మారన్‌ పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నా.. అధికారిక ధృవీకరణ మాత్రం లేదు.

ఐపీఎల్‌ మ్యాచ్‌ల సమయంలో కావ్య మారన్‌ స్టేడియంలో కనిపించినప్పుడల్లా ఆమె రియాక్షన్స్‌, హావభావాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ఈసారి మాత్రం క్రికెట్‌ చర్చల కంటే ఆమె వ్యక్తిగత జీవితంపై వచ్చిన గాసిప్స్‌ ఎక్కువగా వైరల్‌ అయ్యాయి. అనిరుధ్‌ రవిచందర్‌తో కావ్య మారన్‌ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి ప్రకటన రావచ్చని కొన్ని షోషల్​ మీడియా హ్యాండిళ్లు ప్రచారం చేస్తున్నాయి.

ఈ ప్రచారానికి ప్రధాన కారణంగా అనిరుధ్‌, సన్‌ గ్రూప్‌ మధ్య ఉన్న వృత్తిగతమైన అనుబంధాన్ని చూపిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన పలు భారీ చిత్రాలకు అనిరుధ్‌ సంగీతం అందించారు. ఆ వృత్తిపరమైన అనుబంధాన్ని కొందరు వ్యక్తిగత బంధంగా ఊహించుకుంటూ సోషల్‌ మీడియాలో చర్చను పెంచుతున్నారు. అయితే ఈ వాదనలకు ఇప్పటివరకు ఎలాంటి పక్కా ఆధారాలు బయటకు రాలేదు. అలాగని ఖండనలూ రాలేదు.

గతంలో కూడా ఇలాంటి పెళ్లి రూమర్స్‌ వచ్చినప్పుడు అనిరుధ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. "Marriage ah? lol.. Chill out guys. Please stop spreading rumours" అంటూ ఆయన ఆ ప్రచారాన్ని అప్పట్లో తేలికగా కొట్టిపారేశారు. ఆ పాత పోస్ట్‌ స్క్రీన్‌షాట్లు ఇప్పుడు మళ్లీ సోషల్‌ మీడియాలో తిరుగుతున్నాయి.

కావ్య మారన్‌ వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్స్‌ సోషల్‌ మీడియాలో చర్చకు దారితీశాయి.

తాజా పుకార్లపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఈ జంట నిజంగానే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కామెంట్లు చేస్తుండగా, మరికొందరు అధికారిక ప్రకటన లేకుండా ఇలాంటి వార్తలను నమ్మడం సరికాదని చెబుతున్నారు. కొన్ని పోస్టుల్లో పెళ్లి విదేశాల్లో జరుగుతుందని, తర్వాత చెన్నైలో రిసెప్షన్‌ ఉంటుందని పేర్కొన్నా.. అవి కూడా ధృవీకరించని ఊహాగానాలే.

సూపర్​స్టార్​ రజనీకాంత్​కు అనిరుధ్​ దగ్గరి బంధువు కావడం వల్ల ఆయన కూడా ఈ పెళ్లికి సుముఖంగానే ఉన్నట్లు, మారన్​ తల్లిదండ్రులను రజనీ సంప్రదించినట్లు కూడా వార్తలు వినవస్తున్నాయి. వీరిద్దరి వివాహాన్ని ఆమోదించాల్సిందిగా కావ్య తండ్రి కళానిధి మారన్​ను రజనీ కోరినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అనిరుధ్‌ రవిచందర్‌ వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు కావ్య మారన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వ్యవహారాలు, సన్‌ గ్రూప్‌ సంబంధిత బాధ్యతలతో బిజీగా ఉన్నారు. వీరిద్దరి పెళ్లిపై సోషల్‌ మీడియాలో ఎంత చర్చ నడిచినా.. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలను కేవలం రూమర్స్‌గానే చూడాలి.

మొత్తానికి.. అనిరుధ్‌రవిచందర్‌, కావ్యమారన్‌పెళ్లివార్తనెట్టింటవైరల్‌అవుతున్నా, ఇప్పటివరకుదీనికిసంబంధించిఎలాంటిఅధికారికధృవీకరణలేదు. ఇంత జరుగుతున్నా, ఇరు వర్గాల నుండి ఎటువంటి సమాధానమూ రాలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA