Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అవినీతి అనకొండ భీమ్ రెడ్డికి 14రోజుల రిమాండ్

అవినీతి అనకొండ భీమ్ రెడ్డికి 14రోజుల రిమాండ్

VIDHATHA 2 weeks ago

సీబీ సోదాలలో రూ. 200కోట్లకు పైగా అక్రమాస్తుల సంపాదనతో దొరికిపోయిన డీఎస్పీ భీంరెడ్డికి ఏసీబీ కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీంరెడ్డిని సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు.

ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

పోలీసు కంప్యూటర్‌ సర్వీసెస్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీంరెడ్డి ఇంటితోపాటు 15 చోట్ల ఏకకాలంలో గురువారం ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో రూ. 200కోట్లకు పైగా అక్రమాస్తులు కనుగొన్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే భీమ్ రెడ్డిని అరెస్టు చేయాల్సి ఉండగా.. సోదాలకు వచ్చిన అధికారులను చూసి భీంరెడ్డి అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పుడు భీమ్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. అయితే డీఎస్పీ భీమ్ రెడ్డిని అరెస్టు చేయకపోవడం అధికార, రాజకీయ వర్గాల్లో తీవ్ర వివాదస్పదమైంది. ఏసీబీ అధికారులు అవినీతి కేసులలో చిక్కిన ఒక్కో సామాజిక వర్గం అధికారుల పట్ల ఒక్కో రకంగా వ్యవహరిస్తూ వివక్షత ప్రదర్శిస్తున్నారని, భీమ్ రెడ్డిని అరెస్టు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం అంటూ పలువురు బాహటంగానే ప్రశ్నించారు. దీంతో ఎట్టకేలకు సోమవారం సాయంత్రం భీంరెడ్డిని అరెస్టు చేశారు. భీమ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని బీనామీలు, అక్రమాస్తుల గుట్టు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. భీమ్ రెడ్డి వెనుక ఉన్న కీలక వ్యక్తులు ఎవరన్నదానిపై మనుముందు విచారణలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA