Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి భగీరథ పిటిషన్ పై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా!

బండి భగీరథ పిటిషన్ పై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా!

VIDHATHA 1 week ago

పోక్సో కేసులో బండి భగీరథ్ దాఖలు చేసిన మధ్యంతర రక్షణ పిటిషన్‌పై హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసి బాధితురాలి పుట్టిన తేదీ వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

ఫోక్సో కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ మధ్యంతర రక్షణ పిటిషన్ విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. బాధితురాలి పుట్టిన తేదీపై స్పష్టత ఇవ్వాలని, పూర్తి వివరాలు రేపు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. భగీరథ్ కు ముందస్తు రక్షణ ఇవ్వాలా లేదా అన్న దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామని, రేపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు వెల్లడించింది. అలాగే భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

భగీరథ్ పిటిషన్ పై ఆయన తరపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పిస్తే భగీరథ్ పోలీసుల ముందు హాజరవుతాడు అని, అన్ని ఆధారాలు పోలీసులు ముందు ఉంచుతాడు అని హైకోర్టుకు నివేదించారు. అయితే మధ్యంతర రక్షణ ఇవ్వడం అంటే ముందస్తు బెయిల్ ఇవ్వడమేనంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఈ క్రమంలో బాధితురాలు పుట్టిన తేదీ స్పష్టత ఇవ్వాలని, పూర్తి వివరాలు రేపు సమర్పించాలని ఆదేశిస్తూ..విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA