Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భర్త ఐఫోన్ కొనివ్వలేదని 42 ఏళ్ల మహిళ ఆత్మహత్య

భర్త ఐఫోన్ కొనివ్వలేదని 42 ఏళ్ల మహిళ ఆత్మహత్య

VIDHATHA 2 weeks ago

హైదరాబాద్ నగరంలోని కాచిగూడకు చెందిన మల్లికార్జున్ తన భార్య ప్రియ(42) ఆత్మహత్య ......తనకు ఐఫోన్ కావాలని భర్తను ప్రాధేయపడింది. లక్ష రూపాయాలు తన వద్ద లేవని, ఐఫోన్ కొనివ్వలేనని భర్త తెగేసి చెప్పాడు.

ప్రస్తుతం అంతా స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. అయితే మార్కెట్‌లోకి వచ్చే ప్రతి కొత్త ఫోన్‌ను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్లకు బదులుగా ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ ఫోన్‌లో ఉండే ఫీచర్స్ ఫోన్ లవర్స్‌ను అమితంగా ఆకర్షిస్తాయి. అయితే ఓ వివాహిత కూడా తనకు ఐఫోన్ కొనివ్వాలని భర్తను కోరింది. అందుకు భర్త అంగీకరించకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని కాచిగూడలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని కాచిగూడకు చెందిన మల్లికార్జున్ తన భార్య ప్రియ(42), ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే భార్య ప్రియ తనకు ఐఫోన్ కావాలని భర్తను ప్రాధేయపడింది. లక్ష రూపాయాలు తన వద్ద లేవని, ఐఫోన్ కొనివ్వలేనని భర్త తెగేసి చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి కూడా దంపతుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

క్షణికావేశానికి లోనైన ప్రియ ఇంట్లోనే పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమ్య ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి కుటుంబ సభ్యులు, కుమార్తెలు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA