Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భూ భారతితో అసైన్డ్ భూములు కాజేస్తున్న వేం నరేందర్ రెడ్డి: క్రిశాంక్

భూ భారతితో అసైన్డ్ భూములు కాజేస్తున్న వేం నరేందర్ రెడ్డి: క్రిశాంక్

VIDHATHA 5 days ago

భూ భారతి ద్వారా అసైన్డ్ భూములను వేం నరేందర్ రెడ్డి కుటుంబం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుందని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తన కొడుకు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట భూభారతి ద్వారా అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మన్నె క్రిశాంక్ ఆరోపించారు.

మంగళవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసముద్రం అర్భన్ పల్లి గ్రామ పరిధిలో శ్రీ సాయికృష్ణ గ్రానైట్స్ పేరిట వేం నరేందర్ రెడ్డి సతీమణి వేం విజయలక్ష్మి పేరిట మైనింగ్ అనుమతులు తీసుకున్నారు అని, కానీ అదే మైనింగ్ అనుమతి తీసుకున్న సర్వే నంబర్లలో ఉన్నదాదాపు 15ఎకరాల అసైన్డ్ భూములు వేం నరేందర్ రెడ్డి కొడుకు పేరు మీద ఉన్నట్లు భూ భారతిలో రికార్డ్ ఉందని వెల్లడించారు. ఆ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కోసం మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌తో పాటు, అందరు ఉన్నతాధికారులు సంతకాలు చేశారు అని తెలిపారు.

తన అక్రమ భూముల దందాకు సహాయం చేశాడని అదే కలెక్టర్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు స్పెషల్ సెక్రటరీ పదవి ఇచ్చాడు అని క్రిశాంక్ ఆరోపించారు. 2010, 2015 ఎన్నికల అఫిడవిట్‌లో లేని ఆ భూములు, 2026 రాజ్యసభ అఫిడవిట్‌లో వేం నరేందర్ రెడ్డికి ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు.

ఈరోజు రాష్ట్రంలో ఒక పొలిటికల్ బిజినెస్ నడుస్తుందని, అసైన్డ్ భూములు ఆక్రమించడం, దానికి కలెక్టర్ సంతకం పెట్టడం ఏంటి? అని క్రిశాంక్ ప్రశ్నించారు. భూ భారతి అడ్డుపెట్టి వేం నరేందర్ రెడ్డినిషేధిత జాబితాలోని వందల కోట్ల అసైన్ భూములను కాజేస్తున్నా రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి వ్యవహారంపై విచారణ జరిపించి వాస్తవాలు ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఓ వైపు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబం రాఘవ కనస్ట్రక్షన్స్ చేసిన భూ ఆక్రమణలు, సీఎం రేవంత్ రెడ్డి సోదరులు సాగించిన భూ దందాల వివాదం మరువకముందే వేం నరేందర్ రెడ్డి చేసిన అసైన్డ్ భూముల ఆక్రమణలు బయటపడన తీరు చూస్తుంటే కాంగ్రెస్ నాయకులు భూ ఆక్రమణలకు నిదర్శనం అని విమర్శించారు. వేం నరేందర్ రెడ్డి అసైన్డ్ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA