Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దంచే ఎండల్లో.చెట్లే అసలు "కూలర్స్" అట!

దంచే ఎండల్లో.చెట్లే అసలు "కూలర్స్" అట!

VIDHATHA 3 days ago

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం తెచ్చిన కూలర్లు, ఏసీలు సైతం చల్లదనాన్ని అందించలేక భానుడి భగభగల సెగల ముందు తేలిపోతున్నాయి.

ఎండల్లో చెట్టునీడ కనిపిస్తే చాలు..జనం హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నోయిడాలో తాజాగా చేసిన ఓ పరిశోధన.. ఎండల నుంచి రక్షణకి ఏసీలు కాదు… చెట్లే అసలు సహజ శీతల కవచం అంటూ ఓ స్ట్రాంగ్ మెసేజ్ ను ఇచ్చింది.

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం తెచ్చిన కూలర్లు, ఏసీలు సైతం చల్లదనాన్ని అందించలేక భానుడి భగభగల సెగల ముందు తేలిపోతున్నాయి. ఎండల్లో చెట్టునీడ కనిపిస్తే చాలు..జనం హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏసీలు, కూలర్లు ఇవ్వలేని చల్లదనాన్ని ప్రకృతి సహజ సిద్ధమైన చెట్లు అందించడం తెలిసిందే. అయితే వడగాలులు..మండుటెండల్లో చెట్లు ఎలా చల్లదనాన్ని అందిస్తున్నాయన్నదానిపై జనంలో ఎప్పటికి ఆసక్తి మాత్రం తీరని దాహంలా కొనసాగుతునే ఉంది.

ఇందుకు సమాధానంగా తాజాగా ఓ పరిశోధనలో చెట్లే నిజమైన సహజ "కూలర్స్" అంటూ తేలింది. నోయిడాలో ఒకే చోట చేసిన పరిశీలనలో చెట్ల చల్లదనంపై షాకింగ్ ఫాక్ట్ ఒకటి బయటపడింది. ఈ పరిశీలనలో రోడ్డుపై ఉష్ణోగ్రత 48డిగ్రీలుగా ఉన్నప్పుడు..చెట్టు నీడలో మాత్రం 29డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అంటే ఒక్క చెట్టు నీడే దాదాపు 19°C తేడా తీసుకొచ్చిందన్నమాట. ఎండల నుంచి రక్షణకి ఏసీలు కాదు… చెట్లే అసలు సహజ శీతల కవచం అంటూ ఈ పరిశీలన ఓ స్ట్రాంగ్ మెసేజ్ ను ఇచ్చింది. ఇది ప్రకృతి ఇచ్చిన క్లియర్ మెసేజ్ అని గుర్తు చేస్తున్నారు. జనం మొక్కలు, చెట్లను సంరంక్షించడంలో శ్రద్ద చూపడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ వంటి విపత్తులను ఎదుర్కొని పర్యావరణ పరిరక్షణ, వాతావారణ సమతుల్యతలను కాపాడాలని హితవు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA