Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎక్స్పీరియం కల్లు ఫెస్టివల్ ను అడ్డుకుంటాం

ఎక్స్పీరియం కల్లు ఫెస్టివల్ ను అడ్డుకుంటాం

VIDHATHA 3 days ago

క్స్పీరియం పార్క్‌లో నిర్వహించే టాడి మ్యూజికల్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామని కల్లు గీత సంఘాలు హెచ్చరించాయి. గీత వృత్తిపై కార్పొరేట్ దాడి అంటూ మండిపడ్డాయి.

ఎక్స్పీరియం పార్క్ ఆధ్వర్యంలో 24వ తేదీన నిర్వహిస్తున్న టాడి మ్యూజికల్ ఫెస్టివల్ ను అడ్డుకుంటాం అని కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ హెచ్చరించింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆధ్వర్యంలో కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సందర్బంగా కల్లు గీత సంఘాల నాయకులు మాట్లాడుతూ టాడి మ్యూజికల్ ఫెస్టివల్ ను అడ్డుకుంటామని,
ఈ కార్యక్రమానికి అతిధులుగా వెళ్తున్న గౌడ ప్రజా ప్రతినిధులు పునరాలోచించుకోవాలని, మీరు వెళితే ప్రజా క్షేత్రంలో మీకు పరాభవం తప్పదు అని హెచ్చరించారు. గీత వృత్తి పై కార్పొరేట్ దాడిగా ఈ ఫెస్టివల్ ను వారు అభివర్ణించారు.

ఎక్సైజ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు దొర మరో రాందేవ్ రావు దొరకు సహకారం అందిస్తున్నారని,
ఎక్స్పీరియమ్ పార్క్ లో ఉన్న తాటి, ఈత చెట్లను స్థానిక సొసైటీ లకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
రామ్ దేవ్ రావు తో మాకు కంచం పొత్తు ఉందా… మంచం పొత్తు ఉందా అని, మా వృత్తిపై దాడి చేస్తే మీ కుర్చీలు కదులుతాయి అని, వెలమ కులానికి చెందిన వ్యక్తికీ ఎక్సైజ్ శాఖ మంత్రి పదవి ఎలా ఇస్తారు అని గీత సంఘాల నాయకులు ప్రశ్నించారు.

కల్లు, నీరలను గౌడ్ లు మాత్రమే అమ్మాలి అని జీవో తీసుకోచ్చిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారికీ మద్దతు తెలపడం పట్ల సమాధానం చెప్పాల్సి వస్తుందని, దోచుకునే వాల్లు ఏకమైతే కాపాడుకునే మనం ఏకం కావాలి అని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖలోని ఉన్నతాధికారి టాడి ఫెస్టివల్ కు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది అని, ఎవరు అనుమతి ఇచ్చిన అడ్డుకునేది పక్కా అని హెచ్చరించారు. మా కులంలో కలవాలి అనుకుంటే మా కులంతో రాందేవ్ రావు వియ్యమందుకోవచ్చని విమర్శించారు. మాకు కల్లు గీత సొసైటీలు ఉన్నాయి.. నీకు ఏముంది అని మా కల్లు అమ్ముతావు అని వారు రాందేవ్ రావును ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలను కలిసి టాడి మ్యూజికల్ ఫెస్టివల్ పై ఫిర్యాదు చేస్తాం అని, ప్రభుత్వం వెంటనే దీనిని ఆపాలి అని డిమాండ్ చేస్తున్నాం అని వారు స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA