Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏసీల వినియోగం ఏ దేశంలో  ఎక్కువో తెలుసా?

ఏసీల వినియోగం ఏ దేశంలో ఎక్కువో తెలుసా?

VIDHATHA 1 day ago

ప్రపంచంలో చల్లదనం కోసం ఎయిర్ కండిషనర్లు (ACs) చైనా, అమెరికా దేశాల్లో అత్యధికంగా వినియోగిస్తున్నారు. నివాస గృహాల్లో ఏసీల వినియోగంలో జపాన్ అగ్రస్థానంలో కొనసాగుతుంది.

భారత్ లో 27మిలియన్ల ఏసీల వినియోగం సాగుతుంది.

విధాత : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వేసవి ఎండలు మంటలు పుట్టిస్తున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటుతుండటం, రాత్రి వేళల్లో సైతం ఉక్కపోత తగ్గకపోవడంతో ప్రజలు విధిలేని పరిస్థితుల్లో ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లపైనే ఆధారపడుతున్నారు. మెట్రో నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో సైతం గతంలో కంటే ఏసీల కొనుగోళ్లు, వినియోగం విపరీతంగా పెరగడం విద్యుత్ డిమాండ్ ఎన్నడూ లేని విధంగా ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలు ఫ్యాన్ గాలిలో సేదదీరడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏసీలు, కూలర్ల వినియోగం కూడా రెట్టింపు కావడంతో విద్యుత్ సరఫరాపై తీవ్ర ఒత్తిడి పెరిగిపోయిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

చైనాలో ఏసీల వినియోగం అధికం

ప్రపంచంలో చల్లదనం కోసం ఎయిర్ కండిషనర్లు (ACs) చైనా, అమెరికా దేశాల్లో అత్యధికంగా వినియోగిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా 569 మిలియన్ల(56.9 కోట్లు) ఎయిర్ కండిషనర్లను కలిగి ఉండి చైనా అగ్రస్థానంలో ఉంది. చైనాలో సుమారు 56.9 కోట్ల ఏసీ యూనిట్లు వాడుకలో ఉండగా, నివాస గృహాలు, వాణిజ్య సముదాయాలు అన్నీ కలిపి ఈ స్థాయిలో వినియోగం ఉంది. చైనాలో 80శాతం ఇళ్లలో ఏసీలు ఉన్నాయి. ఇకపోతే దాదాపు 374 మిలియన్ల(37.4కోట్ల) యూనిట్ల తో అమెరికా ఏసీల వినియోగంలో రెండవ స్థానంలో ఉంది. అమెరికా దేశంలో దాదాపు 90 శాతం ఇళ్లలో ఏసీలు ఉన్నాయి. మొత్తం యూనిట్లతో రెండవ స్థానంలో నిలిచింది.

నివాస గృహాల ఏసీలలో జపాన్ అగ్రస్థానం

జపాన్ 148 మిలియన్ల యూనిట్లతో ఏసీల వినియోగం మూడవ స్థానంలో ఉంది. జపాన్‌లో 91 శాతం గృహాలలో ఏసీలు వాడుకలో ఉన్నాయి. 116మిలియన్ల రెసిడెన్షియల్, 33కమర్షియల్ యూనిట్ల ఏసీలు వాడుతున్నారు. జనభా అధికంగా ఉన్న భారత్ లో ఏసీల వినియోగం మాత్రం తక్కువగా ఉండటం గమనార్హం. ఏసీల వినియోగం పెరిగితే మాత్రం భారత్ లో విద్యుత్తు డిమాండ్ సమస్య మరింత పెరుగవచ్చన్న ఆందోళన కూడా వినిపిస్తుంది.

భారత్ లో ఏసీల వినియోగం ఎంత శాతం?

గ్లోబల్ వార్మింగ్, జనాభా పెరుగుదల కారణంగా భారతదేశంలో కూడా ఏసీల వాడకం భారీగా పెరిగింది. అయితే ఇతర దేశాలతో పోల్చితే భారత్ లో 27మిలియన్ యూనిట్ల ఏసీల వినియోగం కొనసాగుతుంది. నివాస గృహాల ఏసీల వినియోగం 14శాతం, కమర్షియల్ 13శాతం కావడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA