ఫిలిప్పీన్స్‌లో 'హబల్-హబల్' బైక్ టాక్సీలు వైరల్. ఒకే బైక్‌పై 5-10 మంది ప్రయాణం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఫిలిప్పీన్స్ గ్రామీణ ప్రాంతాల్లో 'హబల్-హబల్' అనే మోటార్ సైకిల్ టాక్సీలు ప్రాచుర్యం పొందాయి.
'హబల్-హబల్' మోటార్ సైకిల్ టాక్సీల వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ వాహనాలపై ప్రయాణించే వారి సంఖ్య ఆ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
ఏమిటీ..'హబల్-హబల్' మోటార్ సైకిల్ టాక్సీ ?
సాధారణ బైక్‌కు అదనపు సీట్లు అమర్చి, ఏకకాలంలో 5-10 మంది ప్రయాణికులను తీసుకెళ్లేందుకు వీలుగా సీట్లను పొడిగించి వీటిని రూపొందించారు. అధికారిక ప్రజా రవాణా సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాలలో హబల్-హబల్ అనధికారిక షేర్డ్ రైడ్స్‌గా పనిచేస్తూ ఒక కీలకమైన రవాణా లోటును పూరిస్తుంది. ఇప్పుడు పిలిప్పీన్స్ గ్రామీణులకు మంచి రవాణా సాధనంగా మారింది.
మనదేశంలో ఇలాంటి ద్విచక్ర వాహనాలపై అధికారికంగా ఇద్దరి కంటే ఎక్కువ అనుమతించరు. కాని పిలిప్పీన్స్ వంటి దేశంలో ఇప్పుడు 'హబల్-హబల్' మోటార్ సైకిల్ టాక్సీ క్రేజీ వాహనంగా మారింది. అధిక జనాభా, అధిక వాహనాలు, అధిక ట్రాఫిక్ వంటి సమస్యలు, ప్రమాదకరమైన రోడ్ల కారణంగా ఈ తరహా వాహనాలను అనుమతిస్తే..లాభాల కంటే నష్టాలే ఎక్కవుంటాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

