Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Harish Rao| ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్ రావు సంచలన ప్రకటన

Harish Rao| ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్ రావు సంచలన ప్రకటన

VIDHATHA 2 days ago

రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఉప నాయకుడు, మాజీ మంత్రి టీ.హరీశ్ రావు స్పష్టం చేశారు.

రంగారెడ్డి జిల్లా కందుకూర్, యాచారం, కడ్తాల్, ముచ్చర్ల మండలాల్లో ప్రతిపాదించిన ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఫార్మా సిటీ కాకుండా ఇతర అవసరాలకు వినియోగించనట్లయితే సేకరించిన రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంటు చట్టం చేసిందన్నారు. ఫార్మా సిటీ నిర్మాణం చేయకుండా, ఫ్యూచర్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు.

విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఉప నాయకుడు, మాజీ మంత్రి టీ.హరీశ్ రావు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూర్, యాచారం, కడ్తాల్, ముచ్చర్ల మండలాల్లో ప్రతిపాదించిన ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఫార్మా సిటీ కాకుండా ఇతర అవసరాలకు వినియోగించనట్లయితే సేకరించిన రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంటు చట్టం చేసిందన్నారు. ఫార్మా సిటీ నిర్మాణం చేయకుండా, ఫ్యూచర్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు.

అమెరికా పర్యటనలో ఉన్న హరీశ్ రావు ఫార్మాసిటీ పై కీలక ప్రకటన చేశారు. ఈ భూములపై హైకోర్టులో కేసు ఉందని, విచారణ సందర్భంగా భూములను ఫార్మా కంపెనీల కోసం వినియోగిస్తామని అఫిడవిట్ ఇచ్చిందన్నారు. అసలు విషయం ఇలా ఉండగా …రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం జిమ్మిక్కు చేస్తోందన్నారు. ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలైన ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. మొత్తం భూమిలో 75 శాతం ఫార్మా సిటీ డెవలప్ మెంట్ చేసి, తక్కిన 25 శాతం భూమిలో మిగతావి ఏర్పాటు చేయాలన్నారు.

దీనికి పూర్తి విరుద్ధంగా 25 శాతం భూమిలో ఫార్మా కంపెనీలు వచ్చేలా ప్రణాళికలు వేశారన్నారు. ఈ ప్రణాళిక చట్ట ప్రకారం చెల్లుబాటు కాదన్నారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. అందుకే మేము ప్రభుత్వం లోకి రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు వంద శాతం చేస్తామని ప్రకటించారు. ఫార్మా సిటీగా పునరుద్ధరిస్తామని, దీంతో లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని మేము ప్రారంభించామన్నారు.

మన రాష్ట్రం నుంచి ఒక్క ఫార్మా కంపెనీ కూడా బయటికి వెళ్లొద్దని, అన్ని అనుమతులు తీసుకున్నామన్నారు. ఫార్మా సిటీ అభివృద్ది చెందితే బీఆర్ఎస్ కు పేరు వస్తుందని ఇలా చేశారని, వాళ్ళు ఏమి చేసినా నడవదు… నిలబడదు అన్నారు. ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఫార్మా సిటీనే వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండున్నర ఏళ్లు గడిచిపోయింది, ఇక రెండున్నరేళ్లు మిగిలి ఉందన్నారు. ఎన్నికలకు ఏడాది ముందు రేవంత్ రెడ్డి ఏ పని చేయలేరని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA