Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు.
అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో సాహసోపేతమైన నిర్ణయాలతో ముందుకెళ్లినప్పటికీ ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. పనిప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో సమష్ఠి నిర్ణయాలతో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి మందగిస్తుంది. వృత్తి పరమైన ఒత్తిడి ఉండవచ్చు. ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ ఖర్చులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కోపావేశాలు తగ్గించుకుని సహనం, శాంతంతో నడుచుకుంటే మంచిది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధనలాభాలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగంలో అధికారయోగం ఉంటుంది. సమాజంలో పరపతి, ప్రజాదరణ పెరుగుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. అవివాహితులకు కల్యాణయోగం ఉంటుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో సంకల్పబలం తగ్గకుండా చూసుకోండి. వృత్తికి సంబంధించిన కీలక నిర్ణయాల్లో ఆచి తూచి అడుగేయండి. ఆర్థిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఖర్చుల గురించి కొంత మానసిక అలజడి ఉంటుంది. వ్యాపారంలో మంచి ప్రణాళికతో ముందుకెళ్తే నష్టాలు తగ్గుతాయి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, ఆర్థికంగా పురోగతి ఉన్నప్పటికీ మితిమీరిన ఖర్చులు, పనిభారం ఒత్తిడి కలిగిస్తాయి. పనిపట్ల ఏకాగ్రత, శ్రద్ధ తగ్గకుండా చూసుకోండి. వ్యాపారంలో వివేకంతో నిర్ణయాలు తీసుకుంటే రాబోయే నష్టాలు నివారించవచ్చు.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్ఠమైన శుభ సమయం నడుస్తోంది. సకల సుఖాలు, సమస్త భోగాలు చేకూరుతాయి. వృత్తిలో సులభంగా పేరు ప్రఖ్యాతలు పొందడానికి అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. సంపదలు చేకూరడంతో పాటు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పట్టుదల, ఏకాగ్రతతో కృషి చేసినప్పటికీ శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఒక వ్యవహారంలో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది. ప్రతి అడుగులోనూ మెలకువ అవసరం. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. అనవసర కలహాలతో కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. ఇంటా బయట ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోండి. పనిభారం పెరిగినప్పటికీ ప్రణాళికతో వ్యవహరిస్తే సకాలంలో అన్ని పనులు పూర్తి చేయగలరు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధా లోపంతో సమస్యలు ఎదురవుతాయి. ప్రారంభించిన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో ప్రతికూల పరిస్థితులతో లాభాలు తగ్గుతాయి. సహనం కోల్పోకుండా ఓపికతో ప్రయత్నిస్తే పరిస్థితులు చక్కబడతాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. సహనంతో ఉంటే క్లిష్టమైన సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అద్భుతమైన సమయం నడుస్తోంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో కీర్తి, గౌరవం లభిస్తాయి. అద్భుతమైన మనోబలంతో ప్రారంభించిన పనులన్నీ సజావుగా పూర్తి చేస్తారు. దైవానుగ్రహంతో సుఖసౌఖ్యాలు, ధనలాభాలు చేకూరుతాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడంతో ఒత్తిడికి గురవుతారు. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృథా ఖర్చులు పెరిగే సూచన ఉంది. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. బంధువుల్లో కొందరి ప్రవర్తన విచారం కలిగిస్తుంది.

