Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad | పెళ్లికి ముందే గర్భం.. ప్రియుడి మోజులో పడి ఆరేళ్ల బిడ్డ హత్య

Hyderabad | పెళ్లికి ముందే గర్భం.. ప్రియుడి మోజులో పడి ఆరేళ్ల బిడ్డ హత్య

VIDHATHA 5 days ago

Hyderabad | ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చింది.. ఈ విషయం పండంటి ఆడబిడ్డ జన్మించిన తర్వాత భర్తకు తెలిసింది. దీంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు భర్త.

ఇక ఆమె కంటే వయసులో చిన్నవాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి సంబంధానికి పాప అడ్డొస్తుందని చెప్పి ఆరేళ్ల బిడ్డను హత్య చేసింది.

Hyderabad | ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చింది.. ఈ విషయం పండంటి ఆడబిడ్డ జన్మించిన తర్వాత భర్తకు తెలిసింది. దీంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు భర్త. ఇక ఆమె కంటే వయసులో చిన్నవాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి సంబంధానికి పాప అడ్డొస్తుందని చెప్పి ఆరేళ్ల బిడ్డను హత్య చేసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ అల్వాల్‌లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. యాదగిరి అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలతో ఓల్డ్ అల్వాల్ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో కొన్నేళ్ల నుంచి నివాసముంటున్నాడు. చిన్న కుమార్తె రేఖను రాజు అనే వ్యక్తికి ఇచ్చి 2020లో వివాహం జరిపించారు. పెళ్లై 9 నెలలు కాకముందే రేఖ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చిందని గ్రహించిన భర్త.. భార్యతో గొడవపడి దూరంగా ఉంటున్నాడు.

ఈ క్రమంలోనే రేఖకు స్థానికంగా కిరణా దుకాణంలో పని చేసే 21 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇతను రేఖ కంటే వయసులో చిన్నవాడు. అయినా కూడా ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడిపై రేఖ ఒత్తిడి తెచ్చింది. ఆరేళ్ల పాప ఉండగా పెళ్లి ఎలా చేసుకుంటానని నిరాకరించాడు. ఆమెను దూరంగా ఉంచడం మొదలుపెట్టాడు.

ఇక మొత్తానికి తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న కూతురు తన్వికను చంపాలని రేఖ నిర్ణయించుకుంది. దీంతో శనివారం రాత్రి తమ అద్దె ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంకులో బిడ్డను ఉంచి నీళ్లు నింపింది. తర్వాత తన బిడ్డ కనిపించడం లేదని నాటకమాడింది. ఆదివారం సాయంత్రం సంపులో తన్విక నిర్జీవంగా ఉండటాన్ని గమనించిన రేఖ సోదరి శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందుగా అనుమానాస్పద కేసుగా పోలీసులు నమోదు చేశారు. దర్యాప్తులో.. తన్వికను రేఖ ఇంటిపైకి తీసుకెళ్తున్న దృశ్యాలను సీసీ ఫుటేజీ ద్వారా గమనించి విచారించడంతో అసలు విషయం బయటపడింది. సాయిపై కూడా కేసు నమోదు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA