Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జలమండలి జీఎం అక్రమాస్తుల చిట్టా పెద్దదే!

జలమండలి జీఎం అక్రమాస్తుల చిట్టా పెద్దదే!

VIDHATHA 4 days ago

లమండలి జీఎం సగ్గం అనంత లక్ష్మి కుమార్ పై ఏసీబీ జరిపిన దాడుల్లో ఏకంగా రూ.100కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. దొరికిన అక్రమాస్తుల చిట్లా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ స్వరేజ్ బోర్డు (HMWS&SB) ప్రాజెక్ట్ డివిజన్-VIII లో జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్) గా పనిచేస్తున్న సగ్గం అనంత లక్ష్మి కుమార్ ఇళ్లపై తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు జరిపిన దాడుల వివరాలను ఆ ఆ శాఖ అధికారులు వెల్లడించారు. మల్లాపూర్‌లోని కుమార్ నివాసంతో పాటు హైదరాబాద్, నిజామాబాద్‌లలోని అతని బంధువులు, బినామీలకు చెందిన తొమ్మిది ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది.ఈ దాడుల్లో బయటపడ్డ ఆస్తుల లిస్ట్ చూసి ఏసీబీ అధికారులకే మైండ్ బ్లాక్ అయ్యింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం డాక్యుమెంట్ విలువ రూ. 5.88 కోట్లే అయినప్పటికీ.. వీటి అసలు మార్కెట్ విలువ రూ. 100 కోట్లకు పైగానే ఉండవచ్చని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సింధు శర్మ తెలిపారు.

మల్లాపూర్ ఇంట్లోనే ఏకంగా రూ. 1.1 కోట్ల నోట్ల కట్టలు, 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులు లభ్యమయ్యాయి. నిజామాబాద్‌లోని నవీపేట, బోధన్‌లతో పాటు సంగారెడ్డిలోని చేర్యాలలో కలిపి ఏకంగా 18 ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు దొరికాయి. ఇవి కాకుండా మహేశ్వరంలో 6 ఓపెన్ ప్లాట్లు, ఉప్పల్‌లో 3 ఫ్లాట్లు, మల్లాపూర్‌లో ఒక జీ+3 ఇల్లు, లగ్జరీ కార్లు, బైకులు ఉన్నట్లు గుర్తించారు. సోదాల అనంతరం కుమార్ భార్య సహా ముగ్గురు కుటుంబ సభ్యులను తీసుకెళ్లి బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేశారు. వాటి నుంచి కూడా బంగారు నగలు, నగదు, దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కుమార్ ను అరెస్ట చేసి రిమాండ్ కు తరలించారు. జలమండలి జీఎం కుమార్ అక్రమాస్తుల కేసుతో ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. జలమండలి, ఓఆండ్ఎం, హెచ్ఎండీఏ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, రవాణా శాఖలు, రిజిస్ట్రేషన్ల శాఖల అధికారులపై నిఘా పెడితే మరిన్ని అవినీతి తిమింగలాలు బయటపడుతాయని కామెంట్లు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA