Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూన్ 21న మళ్లీ నీట్ యూజీ పరీక్ష్

జూన్ 21న మళ్లీ నీట్ యూజీ పరీక్ష్

VIDHATHA 1 week ago

వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-యూజీ (నీట్‌-యూజీ) రీఎగ్జామ్‌ తేదీని నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది.

జూన్‌ 21న మరోసారి పరీక్ష నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది.

విధాత : వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-యూజీ (నీట్‌-యూజీ) రీఎగ్జామ్‌ తేదీని నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. జూన్‌ 21న ఆదివారం మరోసారి పరీక్ష నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది.

ప్రశ్నపత్రం లీక్‌ ఆరోపణల కారణంగా ఈ నెల 3న జరిగిన నీట్‌ యూజీ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు, తల్లిదండ్రుల వినతుల మేరకు నీట్ రీ ఎగ్జామ్ తేదీలను ఎన్టీఏ వెల్లడించింది.

నీట్‌ యూజీ 2026కు సంబంధించిన ప్రశ్నపత్రం రాజస్థాన్‌లో లీకవ్వడం..దీనిపై సీబీఐ విచారణ కొనసాగుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మే 3న జరిగిన నీట్ యూజీ 2026ను ఎన్‌టీఏ రద్దు చేసింది. అయితే నీట్ పేపర్ లీక్, రద్దు పరిణామాలతో కేంద్రంపై విపక్షాలు, తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA