Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాళేశ్వరంలో సరస్వతి నవరత్న మాలా హారతి

కాళేశ్వరంలో సరస్వతి నవరత్న మాలా హారతి

VIDHATHA 3 days ago

కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలలో భాగంగా త్రివేణి సంగమం వద్ద అంగరంగ వైభవంగా కాశీ పండుతులచే సరస్వతి నవరత్న మాలా హారతి నిర్వహించారు

విధాత, ప్రత్యేక ప్రతినిధి: కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలలో భాగంగా త్రివేణి సంగమం వద్ద అంగరంగ వైభవంగా కాశీ పండుతులచే సరస్వతి నవరత్న మాలా హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తులను, ఆహుతులను విశేషంగా ఆకర్షించింది. పుష్కరాలు నిర్వహించే 12రోజుల పాటు ఈకార్యక్రమం జరిపే విధంగా ఏర్పాట్లు చేశారు. హారతి స్తోత్రాలు, మంత్రాలతో సాయంత్రవేళ నిర్వహించే కార్యక్రమం ఆకట్టుకున్నది.

సరస్వతి నవరత్నమాల స్తోత్రం, తొమ్మిది హారతులు:

పుష్కరాల సందర్భంగా నిర్వహించే నవరత్నామాల స్తోత్రం, హారతుల గొప్పదనం పండితులు వివరించారు. ఓంకార హారతి వల్ల పాపాలు పోగొట్టి దీపంలా నిలబెడుతుంది. నాగ హారతి - సర్పదోషాన్ని పోగొట్టి సంతానాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. పంచ హారతి - దీర్ఘాయుష్షును ఇస్తుంది. సూర్య హారతి రోగాలను రూపుమాపి యోగశక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. చంద్ర హారతి పాడి పంటలను, దాంపత్య సౌఖ్యాన్ని, మన: శాంతినిస్తుంది. నంది హారతి ధర్మ బుద్ధిని, కీర్తిని, భక్తిని, యుక్తిని, శక్తిని, విద్యా బుద్ధినిస్తుంది. సింహ హారతి. ధైర్య సాహసాన్ని, నాయకత్వాన్ని, విజయాన్నిస్తుంది. కుంభ హారతి సంపదను, సంతుష్టిని, పుష్టిని కోటి సుఖాలను అందిస్తుంది. నక్షత్ర హారతి నిర్మలమైన మనస్సును, సౌందర్యాన్ని, కీర్తిని అందిస్తుందరి పండితులు వివరిస్తున్నారు. ఈ సరస్వతి నవరత్న మాలా హారతులు వారణాసి కాశీలో గంగా హారతి ఇచ్చే ఏడుగురు పండితులచే వైభవంగా నిర్వహించారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ తొమ్మిది హారతులు వీక్షించి భక్తులు ఆనందపరశమయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA