Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కవిత టీఆర్ఎస్ జెండా దిమ్మె మోడల్ ఆవిష్కరణ

కవిత టీఆర్ఎస్ జెండా దిమ్మె మోడల్ ఆవిష్కరణ

VIDHATHA 1 week ago

టీఆర్ఎస్ జెండా గద్దె మోడల్‌ను కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. మే 20 నుంచి జూన్ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) జెండా దిమ్మె(గద్దె) మోడల్ ను ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. నెల రోజుల పాటు టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించాలని ఈ సందర్బంగా కవిత కేడర్ కు పిలుపునిచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒకే మోడల్ లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెలు నిర్మిస్తున్నామని కవిత తెలిపారు.
బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన స్టేట్ జనరల్ బాడీ సమావేశంలో జెండా గద్దెల మోడల్ ను ఆవిష్కరించారు. మూడు ఫీట్ల ఎత్తు, రెండు ఫీట్ల వెడల్పుతో పార్టీ జెండా గద్దెలు నిర్మించాలని సూచించారు. పార్టీ జెండా గద్దె బేస్ ఒక ఫీట్ ఎత్తులో ఉంటుందని పైభాగం మరో రెండు ఫీట్ల ఎత్తులో ఉంటుందని తెలిపారు.

జెండా గద్దె బేస్ కు గ్రీన్ కలర్.. పై భాగంలో ఉండే జెండా గద్దె కు ఎల్లో కలర్, దాని మధ్యలో తెలంగాణ మ్యాప్ బ్లూ కలర్ లో ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ మ్యాప్ మధ్యలో ఇంగ్లీష్ అక్షరాల్లో టీఆర్ఎస్ అని రాయాలని సూచించారు. జెండా గద్దె బేస్ గ్రీన్ కలర్ మధ్యలో తెలుగులో తెలంగాణ రక్షణ సేన అని రాయాలని సూచించారు.

పార్టీ జెండా కలర్ కోడ్స్ కూడా తాము ఇచ్చిన విధంగానే చూసుకోవాలని.. అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా జెండాలన్నీ ఏకరూపంలో ఉంటాయని వెల్లడించారు. ఈనెల 20వ తేదీ నుంచి జూన్ 20 వరకు జెండా పండుగను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA