Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేబీఆర్ పార్కు పరిసరాల చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

కేబీఆర్ పార్కు పరిసరాల చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

VIDHATHA 6 days ago

కేబీఆర్ పార్కు పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్‌లో చెట్లు నరకరాదని స్పష్టం చేసింది.

విధాత: కేబీఆర్ పార్కు పరిసరాలలో చెట్ల నరికివేతపై కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.

కేబీఆర్ పార్కు పరిసరాలలో చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోని 25-35 మీటర్ల ప్రాంతంలో చెట్లను నరకరాదని స్పష్టం చేస్తూ స్టే విధించింది. తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు స్టేతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ (SRDP) పనులు తాత్కాలికంగా ఆగిపోనున్నాయి.

కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం హైకోర్టు సెలవులను అదునుగా తీసుకుని చెట్లు నరికివేస్తుందని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది కె. వివేక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పర్యావరణ ప్రేమికురాలు గచ్చిబౌలి కి చెందిన కాజల్ మహేశ్వరి తరపున ఆయన పిటిషన్ వేశారు. జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ పై విచారణ చేపట్టింది. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై స్టే విధిస్తూ ఆదేశాలిచ్చింది. ఎకో సెన్సిటివ్ జోన్ (25-35 మీటర్ల పరిధి) లోపల చెట్లను నరకరాదని స్పష్టం చేసింది. పర్యావరణ ప్రేమికుల తరఫున కోర్టులో సీనియర్ కౌన్సిల్ కె. వివేక్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA