Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేసీఆర్ పై కవిత మరోసారి విమర్శలు

కేసీఆర్ పై కవిత మరోసారి విమర్శలు

VIDHATHA 1 week ago

కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై కేసీఆర్‌ను కవిత తీవ్రంగా విమర్శించారు. వేల కోట్లు ఖర్చు చేసినా రైతులకు నీళ్లు అందలేదని ఆరోపించారు.

తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఓ డిజిటల్ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోవడంతో తెలంగాణ ప్రజలు, రైతులకు దక్కాల్సిన వాటా జలాలను సద్వినియోగం చేసుకోలేకపోతుందని..ఇందుకు కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు రూ.1.21లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఎందుకు నీళ్లు రాలేదు అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డికి 30నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారని, పదేళ్లయినా చుక్కనీరు అందించలేదని, రూ.32వేల కోట్ల అంచనా వ్యయం కాస్తా..రూ.80వేల కోట్లకు పెరిగిపోయిందని విమర్శించారు. ఇవ్వాళ కూడా పాలమూరు జిల్లాలో వలసలు కొనసాగుతున్నాయని, ఇందుకు రాష్ట్రాన్ని పాలించిన వారు బాధ్యత వహించాలన్నారు. గోదావరి నీళ్లు నేటికి 4వేల టీఎంసీలు సముద్రంలోకి వెలుతున్నాయని వాటి సద్వినియోగానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందన్నారు.

కేసీఆర్ ను మరమనిషి అని అనడం వెనుక కారణం ఉందని, ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ తో ఎవరికీ ఏ సమస్య లేదని, సీఎంగా, బీఆర్ఎస్ అధినేతగా ఉండే కేసీఆర్ తోనే సమస్య అని అందుకే అలా విమర్శించాల్సి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ నా అభిప్రాయాలను స్వేచ్చగా ఆయనకు చెప్పుకోలేకపోయానన్నారు. ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలని, ప్రజల జీవితాల్లో మార్పు తేవాలన్న సంకల్పంతోనే కొత్త పార్టీ పెట్టానన్నారు. పాంచజన్యం ప్రణాళికతో ప్రజలకు మేలు చేయాలని ముందుకెలుతున్నామని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మా పార్టీ పోటీ చేస్తుందని, అధికారంలోకి వస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో మహిళపై నేరాలు పెరిగిపోతున్నాయని, కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు కేసులో ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, తప్పుబడుతున్నారని కవిత పేర్కొన్నారు. ఈ కేసుతో బండి సంజయ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతిందని, ఆయన పదవి నుంచి తప్పుకోవడం మంచిదన్నారు. ఇందుకోసం ప్రధానికి లేఖ రాస్తామని తెలిపారు. ప్రధాని మోదీతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కలిసే ఉన్నారని, కొత్తగా కలువాలన్న మాట హాస్యస్పదం అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల ఎగవేతలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం తీసిపోకుండా ఉన్నాయని విమర్శించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA