Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మళ్లీ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..కేబినెట్ విస్తరణపై క్లారిటీ!

మళ్లీ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..కేబినెట్ విస్తరణపై క్లారిటీ!

VIDHATHA 1 week ago

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన తన పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేతలను కలవనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ సందర్బంలో రాష్ట్రంలో ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన తన పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేతలను కలవనున్నారు. అలాగే సాయంత్రం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ కుమార్తె వివాహానికి కూడా సీఎం హాజరుకానున్నారు. మే 18న జరగనున్న కేరళ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా రేవంత్ రెడ్డి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.

సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ సందర్బంలో రాష్ట్రంలో ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర కేబినెట్ లో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవుల భర్తీ లేక మంత్రివర్గంలో మార్పులు, చేర్పులతో పునర్ వ్యవస్థీకరణ అంశంపై అధిష్టానం పెద్దలతో చర్చించి ఓ క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేయవచ్చని తెలుస్తుంది. పలువురు మంత్రుల పనితీరు సక్రమంగా లేకపోవడం, అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటుండటం, సొంత జిల్లాల్లోనే కొందరు మంత్రులు పార్టీ ఎమ్మెల్యేల, ఎంపీలు, ఎమ్మెల్సీలతో విబేధాలు ఎదుర్కొంటుండటం వంటి పరిణామాలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.

తెలంగాణ కేబినెట్‌లో మొత్తం 18 మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా 16 మంది మంత్రులు ఉన్నారు. మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి నిజామాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఆ జిల్లాలకు ప్రాతినిథ్యంపై ఆలోచన చేయవచ్చు.సామాజిక, జిల్లాల సమీకరణలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు సీఎం రేవంత్ రెడ్డి కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు.

పాత, కొత్తల మేలు కలయికగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే వచ్చే ఎన్నికల దిశగా పాలన సవ్యంగా సాగించి మరోసారి అధికారం అందుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ కంటే పునర్ వ్యవస్థీకరణ మేలు అని రేవంత్ రెడ్డి భావిస్తూ..అందుకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాల కథనం. జిల్లాలో అసమ్మతిని ఎదుర్కొంటూ, అవినీతి ఆరోపణలలో చిక్కుకుని, శాఖల నిర్వహణలో వైఫల్యం చెందిన మంత్రులను అధిష్టానం ఆమోదంతో తప్పించే యోచనలో సీఎం ఉన్నట్లుగా కథనాలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను స్పీకర్ స్థానానికి మార్చి, గడ్డం ప్రసాద్ ను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చన్న ప్రచారం వినిపిస్తుంది. అలాగే పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలలో కనీసం ఇద్దరినైనా తప్పించి. .వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వవచ్చని, మరికొందరి మంత్రుల శాఖలను మార్చవచ్చన్న ప్రచారం కూడా కొంత కాలంగా కొనసాగుతుంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కూడా పూర్తవ్వడంతో రానున్న కాలంలో ప్రభుత్వ పాలనలో వేగం పెంచి ఎన్నికల ముందు ప్రజాదరణ సాధించే దిశగా మంత్రివర్గ కూర్పు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. 2034వరకు నేనే సీఎంగా ఉంటానంటున్న రేవంత్ రెడ్డి అందుకు ప్రజాదరణ సాధించే పాలన అందించాల్సి ఉంటుంది. ప్రస్తుత మంత్రివర్గంలో సింహభాగం సీనియర్లు మంత్రులుగా ఉన్నారు. వారిలో కొందరు సీఎంను లెక్కచేయని పరిస్థితి తరుచూ వెలుగుచూస్తుంది. మరోవైపు మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య సైతం పెరిగిపోతుంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ , ఎమ్మెల్సీ విజయశాంతి, దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, బోధన్‌ ఎమ్మెల్యే మాజీ మంత్రి పీ. సుదర్శన్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే తమ్మన్నగారి రాంమోహన్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్‌ లు మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కోటా నుంచి మల్ రెడ్డి, రంగారెడ్డి, రాంమోహన్ రెడ్డిలు తాజాగా ఢిల్లీకి వెళ్లి మరి లాబియింగ్ చేయడం గమనార్హం.

వారికి మంత్రివర్గంలోకి అవకాశం కల్పించాలంటే ప్రస్తుతం ఉన్న రెండు ఖాళీ బెర్త్ ల భర్తీతో పాటు ప్రస్తుత మంత్రుల్లో ఇద్దరు ముగ్గురినైనా బయటకు పంపించక తప్పదు. ఈ నేపథ్యంలో అసమ్మతి రాజుకోకుండా అధిష్టానం ఆమోదంతో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు సీఎం పావులు కదుపుతున్నట్లుగా పార్టీ వర్గాలలో ప్రచారం వినిపిస్తుంది.

నానాటికీ తగ్గిపోతున్న అసెంబ్లీ సమావేశాలు..
Watermelon Death | మళ్లీ అదే టెన్షన్.. పుచ్చకాయ తిన్న కాసేపటికే తండ్రి మృతి.. కొడుకు పరిస్థితి విషమం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA