Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరో వైరస్‌ అలజడి..హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యుహెచ్ వో

మరో వైరస్‌ అలజడి..హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యుహెచ్ వో

VIDHATHA 1 week ago

ప్రపంచాన్ని తరచూ ఓ కొత్త వైరస్ లు వణికిస్తున్నాయి. కరోనా వైరస్ సృష్టించిన వినాశనం మరువకముందే..ప్రపంచ దేశాలలో ఎక్కడో ఓ చోట పలు రకాల వైరస్ వ్యాప్తి చెందుతూ కలవర పెడుతున్నాయి.

ఇటీవల హంటా వైరస్...కొత్తగా ఎబోలా వైరస్ జనాన్ని భయపెడుతున్నాయి.

విధాత : ప్రపంచాన్ని తరచూ ఓ కొత్త వైరస్ లు వణికిస్తున్నాయి. కరోనా వైరస్ సృష్టించిన వినాశనం మరువకముందే..ప్రపంచ దేశాలలో ఎక్కడో ఓ చోట పలు రకాల వైరస్ వ్యాప్తి చెందుతూ కలవర పెడుతున్నాయి. కరోనా వైరస్ మరణాలను సంఖ్యను తాజాగా డబ్ల్యుహెచ్ వో 2020 మరియు 2023 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 22.1 మిలియన్ల (2.21 కోట్ల) మరణాలు సంభవించాయని అంచనాలు వెల్లడించింది. కోవిడ్ సమయంలో ఈ మరణాల సంఖ్య దాదాపు 7.1 మిలియన్లు (71 లక్షలు)గా అంచనా వేసింది. ప్రపంచాన్ని ఆరోగ్య పరంగా, ఆర్థికంగా వినాశనం చేసిన కరోనా వైరస్ తర్వాత కూడా పలు రకాల వైరస్ కేసులు వెలుగు చూస్తూ ఆందోళన రేపుతున్నాయి.

నిన్న 'హంటా వైరస్'

ఇటీవల అట్లాంటిక్‌ మహా సముద్రంలోని మారుమూల దీవులను సందర్శించడానికి వెళ్లిన 'ఎంవీ హోండియస్‌' డచ్ క్రూయిజ్‌ నౌకలోని 23దేశాల పర్యాటకులకు ప్రాణాంతక 'హంటా వైరస్' సోకడం ప్రపంచాన్ని భయపెట్టింది. వెంటనే రంగంలోకి దిగిన డబ్ల్యుహెచ్ వో వైరస్ కట్టడికి అన్ని చర్యలు చేపట్టింది. హంటావైరస్ మరణాల రేటు 35% నుండి 45% వరకు ఉంటుందని..ఇది COVID మరణాల రేటు కంటే 440 రెట్లు ఎక్కువని నిపుణుల అంచనా.

నేడు 'ఎబోలా వైరస్‌'

'హంటా వైరస్' రేపిన అలజడి సద్దుమణిగిందో లేదో..ఇప్పుడు ఆఫ్రికా దేశం కాంగోలో ప్రాణాంతక ఎబోలా వైరస్‌ జడలు విప్పింది. ఎబోలా వైరస్‌ కారణంగా కాంగోలో 80 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. మరో 246 మంది ఈ వైరస్‌ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎబోలా వ్యాప్తిని డబ్ల్యూహెచ్‌వో.. 'అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి (గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ)'గా ప్రకటించింది. దీనివల్ల ప్రపంచ దేశాలకు తక్షణ ముప్పు లేకపోయినా.. కాంగో పొరుగు దేశాలకు వేగంగా వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించింది. ఇతర దేశాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA