Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరోసారి సీఎన్‌జీ ధర పెంపు..మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు?

మరోసారి సీఎన్‌జీ ధర పెంపు..మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు?

VIDHATHA 1 week ago

కేంద్ర ప్రభుత్వం సీఎన్‌జీ ధరలను మరోసారి పెంచింది. కిలో సీఎన్‌జీపై రూ.1 చొప్పున పెంచింది. రెండు రోజుల క్రితమే కిలో సీఎన్‌జీపై రూ.2 పెంచింది. సీఎన్జీ ధరల పెంపు క్రమంలోనే మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచేందుకు కేంద్రం సిద్దమైనట్లుగా వార్తలు వెలువడుతున్నాయి.

విధాత: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభం క్రమంలో కేంద్ర ప్రభుత్వం సీఎన్‌జీ ధరలను మరోసారి పెంచింది. కిలో సీఎన్‌జీపై రూ.1 చొప్పున పెంచింది. రెండు రోజుల క్రితమే కిలో సీఎన్‌జీపై రూ.2 పెంచింది. మళ్లీ రూ.1 పెంచడంతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.80.09కి చేరింది.

పెట్రోల్, డీజిల్ ధరలు కూడా మళ్లీ పెంపు ?

సీఎన్జీ ధరల పెంపు క్రమంలోనే మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచేందుకు కేంద్రం సిద్దమైనట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ ధఫా పెట్రోల్, డీజిల్ పెంపు లీటర్ పై ఏకంగా రూ. 5నుంచి 10రూపాయల వరకు ఉండవచ్చని తెలుస్తుంది. పశ్చిమాసియ యుద్దంతో ఇంధన కొరత కొనసాగుతుండటంతో.. కేంద్రం దశల వారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ వెళ్లవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA