మీరు రాత్రంతా తగినన్ని గంటలు నిద్రపోయి.. ఉదయాన్నే లేచారు. నిద్ర సరిపోయిందనుకున్నా ఏదో అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సార్లు తగినన్ని గంటలు నిద్రపోయి లేచినప్పుడు మంచిగా అనిపిస్తూ ఉంటుంది.
ఎందుకని?
మనిషికి ఇంత వరకూ అంతుచిక్కని మనిషి రహస్యాల్లో కలలు అనేది ఒకటి. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక కలతో నిద్రలేస్తూ ఉండటం సహజమే. మీకెప్పుడైనా అనిపించిందా? తగినంత సమయం నిద్రపోయిన తర్వాత కూడా కొన్ని కలల తర్వాత నిద్ర లేచినప్పుడు సుఖంగా ఉండటం, మరికొన్ని కలల తర్వాత అసౌకర్యంగా ఉండటం గమనించారా? ఇదే అంశంపై తాజాగా అధ్యయనం నిర్వహించారు. కలలు…. గతంలో భావించిన దానికంటే మన నిద్ర ప్యాట్రన్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తాయని ఈ అధ్యయనంలో తేలింది.
ఈ అధ్యయనాన్ని ఇటలీలోని ఐఎంటీ స్కూల్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ లుక్కాలోని పరిశోధకులు నిర్వహించారు. విస్పష్టమైన కలలు నిద్రను మరింత గాఢంగా, మరింత సుఖవంతంగా మార్చుతాయని ఈ అధ్యయనంలో కనుగొన్నారు. ఈ అధ్యయనం వివరాలను PLOS Biologyలో పబ్లిష్ చేశారు. వాస్తవానికి బ్రెయిన్ యాక్టివిటీ స్లోగా ఉండటం గాఢమైన నిద్రను ప్రభావితం చేస్తుందని ఇప్పటి వరకూ భావిస్తూ వచ్చారు. ఈ భావనను తాజా అధ్యయనం సవాలు చేస్తున్నది.
స్పృహలేని సమయాల్లో మెదడులో మందగించే యాక్టివిటీ.. అంటే మైండ్ పీస్‌ఫుల్‌గా ఉండటమే ప్రాథమికంగా గాఢమైన నిద్రకు కారణంగా అనేక సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
దీనిని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు.. పరిశోధకులు 44 మంది వయోజనులను అధ్యయనానికి ఎంచుకున్నారు. వారి నిద్రలను నాలుగు రోజులపాటు గమనించారు. నాన్ ఆర్‌ఈఎం సమయంలో అనేకసార్లు వారిని నిద్రలేపి, ఆ తక్షణం వారికి కలిగిన అనుభవాలను తెలుసుకున్నారు. అదే సమయంలో వారి బ్రెయిన్ యాక్టివిటీని ఈఈజీ ద్వారా రికార్డ్ చేశారు.
ఈ ఫలితాలను క్రోడీకరించి పరిశీలించగా.. నెమ్మదించిన మెదడు తరంగాలు బలమైన గాఢ నిద్ర భావనతో ముడిపడి ఉన్నాయని తేలింది. అదే సమయంలో ఒక ఆసక్తికర అంశం కూడా వెల్లడైంది. తాము సదరు కలను తిరిగి గుర్తు చేసుకోలేక పోయినా.. తాము కలగన్న సమయంలో గాఢ నిద్ర భావన తీవ్రమైందని చెప్పడం విశేషం.
నిజానికి, మెలకువగా ఉన్నప్పుడు ఉండే మెదడు పరిస్థితి లానే కలలు కనడంలో కూడా మరింత చురుకైన నమూనాలు ఉన్నప్పటికీ, కలలు కనడం గాఢ నిద్ర అనుభూతిని పెంచుతున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ కల రకం కూడా ముఖ్యమైనదే. స్పష్టమైన, భావోద్వేగభరితమైన, అసాధారణమైన కలలు బలమైన గాఢ నిద్ర అనుభూతితో ముడిపడి ఉంటాయి. మరోవైపు, తాము ఆలోచిస్తున్నామని ప్రజలు గ్రహించే, మరింత అమూర్తమైన లేదా ఆలోచనాత్మకమైన కలలు తేలికపాటి నిద్ర అనుభూతితో ముడిపడి ఉంటాయి.
కలలు కనే అనుభవం.. మనసును బాహ్య ప్రపంచం నుంచి మరింత వేరుగా ఫీల్ అయ్యేలా చేసి.. బలమైన విశ్రాంత భావనను కలిగిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే.. మీ మెదడు.. ఎంత నెమ్మదించిందనేదానికంటే.. మీరు కలలో ఎంతగా లీనమైపోయారన్న దాని బట్టే.. మీరు ఎంత చక్కగా నిద్రపోయారనేదాన్ని నిర్ణయిస్తుందని పేర్కొంటున్నాయి.
త్వరలోనే.. తెలంగాణ కేబినెట్ లో భారీ మార్పులు !
Suicide | ఓయో రూమ్‌లో పెళ్లి బట్టల్లోనే ఉరేసుకున్న యువకుడు
Coffin Sessions | మరణానికి ముందే శవపేటికలో గడుపుతున్న యువత.. ఏంటీ ఈ ట్రెండ్!

